YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఎన్నికల నిర్వహణపై ఈసీదే తుది నిర్ణయం  జగన్ కు సుప్రీంకోర్టు షాక్

ఎన్నికల నిర్వహణపై ఈసీదే తుది నిర్ణయం  జగన్ కు సుప్రీంకోర్టు షాక్

ఎన్నికల నిర్వహణపై ఈసీదే తుది నిర్ణయం
            జగన్ కు సుప్రీంకోర్టు షాక్
న్యూ డిల్లీ, మార్చి 18
స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టు నుంచి జగన్ కు విరుద్ధంగా తీర్పు ఇచ్చింది. ఎన్నికల నిర్వహణపై ఈసీదే తుది నిర్ణయమని సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూ జగన్ షాకిచ్చేలా నిర్ణయం వెలువరించింది. ఎన్నికల సంఘం తీరుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దానిపై సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ బోబ్డే నేతృత్వంలోని జస్టిస్ బి.ఆర్.గవాయ్ జస్టిస్ సూర్యకాంత్తో కూడిన త్రిసభ్య ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో ఎన్నికల నిర్వహణకు ఆదేశాలు జారీ చేయలేమని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనేది ఎన్నికల సంఘం ఇష్టమని పేర్కొంది. అయితే ఎన్నికల నియమావళిని మాత్రం వెంటనే ఎత్తివేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఎన్నికల కోడ్ ఎత్తివేస్తే పాత పథకాలు కొనసాగించవచ్చని.. కొత్త పథకాలను మాత్రం తీసుకు రావొద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశాలు చేసింది. ఇక ఎన్నికల నిర్వహణ అంశంపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించాలని ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు సూచించింది. అయితే ఈ తీర్పుతో జగన్ ప్రభుత్వానికి రుచించలేదు. ఎన్నికలు నిర్వహించడానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేస్తుందని భావించగా తద్విరుద్ధంగా రావడంతో జగన్ పునరాలోచనలో పడ్డారు. అయితే ఆయనకు ఉగాది పండుగకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడానికి మాత్రం అడ్డంకి తొలగింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇళ్ల పట్టాల పంపిణీ చేసుకోవచ్చు. కరోనా నేపథ్యంలో ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్న దానిపై సీఎం జగన్ తో సహా మంత్రులు ఎమ్మెల్యేలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలతో వారి నోట మాట రావడం లేదు.

Related Posts