YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

.రేవంత్ రెడ్డికి  పీసీసీ పగ్గాలు.. సీనియర్ నాయకుల అడ్డుపుల్లలు 

.రేవంత్ రెడ్డికి  పీసీసీ పగ్గాలు.. సీనియర్ నాయకుల అడ్డుపుల్లలు 

.రేవంత్ రెడ్డికి  పీసీసీ పగ్గాలు.. సీనియర్ నాయకుల అడ్డుపుల్లలు 
హైదరాబాద్, మార్చి 18
కాంగ్రెస్ లో కుమ్ములాటలు తీవ్రంగా ఉంటాయి. ఆ కుమ్ములాటలే పార్టీని కొంపముంచుతుంటాయి. ఒక నాయకుడు ఎదుగుతున్నాడంటే అతడిని తొక్కేయాలనే మనస్తత్వం కాంగ్రెస్ నాయకులకు ఉంటుంది. అందుకే ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీ నాయకులు అభద్రతాభావంతో జీవిస్తున్నారు. ఇలాంటివి ఉండబట్టే కాంగ్రెస్ పార్టీని ముంచుతోంది. ఈ విషయాన్ని గమనించడం లేదు. ఆంధ్రప్రదేశ్ లో ఎలాగో పార్టీ మట్టి కరిచిపోగా అంతోఇంతో తెలంగాణలో ఉంది. అయితే తెలంగాణలో పార్టీ ప్రభావం చూపే స్థాయిలో ఉంది. కొంచెం కష్టపడితే అధికారం సొంతం చేసుకునే స్థాయిలో ఉన్నా.. ఆ పార్టీ నాయకుల వైఖరితో అధికారం రోజురోజుకు దూరమైపోతూ.. చివరకు ప్రభావం చూపే స్థాయికి కూడా చేరడం లేదు. ఈ సమయంలో పార్టీకి ఆశాకిరణంగా.. యువ నాయకుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు. ప్రస్తుతం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డికి ఇప్పుడు పీసీసీ పగ్గాలు అప్పగిస్తున్నారనే భయంతో సీనియర్ నాయకులు అడ్డుపుల్లలు వేస్తున్నారని సమాచారం. రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు అప్పగించకుండా సొంత పార్టీ నాయకులు రాజకీయం చేస్తున్నారంట. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వర్గ విబేధాలు తీవ్రంగా ఉన్నాయి. ఒక్కో జిల్లాలో రెండు మూడు వర్గాలు ఉండగా.. రాష్ట్రంలో కూడా నాయకులు ఐక్యత లేదు. ఈ ఐక్యత కొరవడడమే వరుసగా జరిగిన ఎన్నికల్లో పార్టీ తీవ్రంగా నష్టపోతున్నది. ఈవిషయాన్ని ఆ పార్టీ నాయకులు ఇంకా గుర్తించడం లేదు. ఈ పార్టీ లోపాలను అధికార పార్టీ వినియోగించుకుని కాంగ్రెస్ ను తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఇప్పటికే పార్టీ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో పార్టీలో ఏ నాయకుడు లేనంతా రేవంత్ రెడ్డి హవా సాగిస్తున్నాడు. ఆయన మొదటి నుంచి కేసీఆర్ కేటీఆర్ లక్ష్యంగా దూసుకెళ్తున్నాడు. ఈ సందర్భంగా పార్టీలో తీవ్రంగా కష్టపడుతున్నాడు. తనదైన పద్ధతిలో రేవంత్ రెడ్డి సొంతంగా కార్యక్రమాలు రూపుదిద్దుకుని వెళ్తున్నాడు. ఈ క్రమంలో అతడి పనితీరును గుర్తించి పీసీసీ పగ్గాలు అప్పగిస్తున్నారని ఢిల్లీ వర్గాల్లో వార్త వినిపిస్తోంది. దీన్ని గుర్తించిన తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అప్రమత్తమయ్యారంట. ఎలాగైనా రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు అప్పగించొద్దని అధిష్టానం వద్ద మొర పెట్టుకున్నారని సమాచారం. పీసీసీ పీఠం ఎవరికైనా కట్టబెట్టండి కానీ.. రేవంత్ రెడ్డిని మాత్రం వద్దని కోరుతున్నారంట. ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడిగా పోటీ చేసేందుకు వృద్ధ నాయకులతో పాటు ఎంతో మంది సీనియర్ నాయకులు ముందుకు వస్తున్నారు. తమకు ఒక్క చాన్స్ అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు అధిష్టానం ముందు మోకరిల్లుతున్నారు. అయితే రేవంత్ రెడ్డికి పదవి ఇవ్వకుండా తమ మధ్య ఉన్న విబేధాలను పక్కన పెట్టి సీనియర్ నాయకులు ఏకమయ్యారంట. దాదాపు పదికి మందికి పైగా కోరుతున్నారంట. ఆ మేరకు అధిష్టానం వద్ద తమ ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. సొంత అజెండాతో ముందుకుపోతున్న రేవంత్ను పీసీసీ చీఫ్ చేస్తే ఊరుకునేది లేదని సీనియర్ నాయకులు హెచ్చరిస్తున్నారంట. ఎందుకంటే రేవంత్ రెడ్డిపై ఇప్పుడు తీవ్ర అవినీతి అక్రమాలు బయటపడుతున్నాయి. మాజీ కేంద్రమంత్రి సీనియర్ నాయకుడు జైపాల్ రెడ్డితో ఉన్న అనుబంధం.. దాన్నుసరించి రేవంత్ రెడ్డికి అధిష్టానంలో కొంత గుర్తింపు ఉంది. రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకుల్లో కొందరు సీనియర్ నాయకులు రేవంత్ నాయకత్వానికి మద్దతు తెలుపుతున్నారంట. పార్టీకేది మంచి జరిగితే వారికే మద్దతివ్వాలని మాజీ ఉప ముఖ్యమంత్రి చెప్పారని వార్త వినిపిస్తోంది. వీటన్నిటి నేపథ్యంలో రేవంత్ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగిస్తే నిత్యం నోటుకు ఓటు కేసు భూ దందాలు బ్లాక్ మొయిల్ రాజకీయాలతో పార్టీ పరువు పోతుందని సీనియర్ నాయకులు అధిష్టానానికి వివరిస్తున్నారంట. రేవంత్ రెడ్డికి పీసీసీ రాకుండా ఎలాగైనా అడ్డుకోవాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. వారికి రేవంత్ రెడ్డి విషయంలో ప్రభుత్వం బయటపెడుతున్న అక్రమాలు భూ ఆక్రమణలను సాకుగా చూపుతున్నారు. ఈ విధంగా రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నిక కాకుండా అడ్డుకుంటుండడం కాంగ్రెస్ లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి వర్గం సీనియర్లంతా ఒక వర్గం ఏర్పడినట్టు పరిణామం కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్ లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచి చూడాలి.

Related Posts