YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

ఆకతాయి ఆటో డ్రైవర్‌ కు దేహశుద్ది

ఆకతాయి ఆటో డ్రైవర్‌ కు దేహశుద్ది

. ఆకతాయి ఆటో డ్రైవర్‌ కు దేహశుద్ది
-విద్యార్థినికి వేధింపులు.. చితక్కొట్టిన ఆమె తల్లి
-విస్సాకోడేరులో ఘటన నిందితుడి అరెస్ట్‌
పాలకోడేరు(పశ్చిమ గోదావరి), మార్చి 18
ఓ బాలికను వేధిస్తున్న ఆటో డ్రైవరుకు ఆమె తల్లి దేహశుద్ధి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాలకోడేరు మండలం విస్సాకోడేరు హైస్కూల్‌లో దువుకుంటున్న బాలికను మొగల్తూరు మండలం పేరుపాలానికి చెందిన ఆటో డ్రైవరు  తన్నేటి రమేష్‌ కొంతకాలంగా వేధిస్తున్నాడు. రమేష్‌ తరచూ గ్రామంలోని బంధువుల ఇంటికి వస్తూ బాలిక వెంటపడేవాడు. బాలిక పేరును సైతం శరీరంపై పచ్చబొట్టు వేయించుకున్నాడు. విషయం బాలిక కుటుంబ సభ్యులకు తెలిసి రెండుసార్లు మందలించారు అయినప్పటికీ రమేష్‌ బాలిక వెంటపడుతుండడంతో ఐదు రోజుల క్రితం బాలిక తల్లి పాఠశాల వద్దకు రమేష్‌ను ఈడ్చుకు వచ్చి విద్యార్థులందరి ముందు చేతికి దొరికిన వస్తువులతో దేహశుద్ధి చేసింది. అల్లరవుతుందనే ఉద్దేశంతో కుటుంబ సభ్యులు గుట్టుగా ఉంచినప్పటికీ ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో చివరకు  పోలీసులకు ఫిర్యాదు చేశారు. రమేష్‌పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పాలకోడేరు పోలీసులు తెలిపారు. ఆటో డ్రైవర్‌ రమేష్‌ను అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Related Posts