YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి దేశీయం

ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. పరీక్షలు రాయకుండానే పాస్‌

ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. పరీక్షలు రాయకుండానే పాస్‌

ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. పరీక్షలు రాయకుండానే పాస్‌
లక్నో, మార్చి 18
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు నిర్వహించకుండానే పాస్‌ చేస్తామని ఆ రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ వెల్లడించింది. విద్యార్థులందరినీ ఎలాంటి ఆటంకం లేకుండా పైతరగతులకు ప్రమోట్‌ చేస్తామని స్పష్టం చేసింది. యూపీలో ప్రైమరీ పాఠశాలలకు మార్చి 23 నుంచి 28 వరకు వార్షిక పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ, కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఆ పరీక్షలను రద్దు చేశారు. ఇక మిగతా తరగతుల విద్యార్థులకు నిర్వహించాల్సిన పరీక్షలను వాయిదా వేశారు. ఏప్రిల్‌ 2 వరకు విద్యాసంస్థలకు యూపీ ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. 

Related Posts