ఎన్నికల వాయిదా దారుణం
తిరుపతి, మార్చి 18
కరోనా వ్యాధి కారణంగా ఎన్నికలు వాయిదా వేయడం దారుణమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తిరుపతి లో ఆయన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల అదికారి రమేష్ కుమార్ పై మంత్రి తీవ్రంగా మండి పడ్డారు. ఎన్నికలు అనుకున్న ప్రకారం జరిగి ఉంటే ప్రజాప్రతి నిధులు గ్రామాల్లో, వార్డు ల్లో, పట్టణాల్లో ప్రజలకు సేవ చేసి ఈ కరోనా వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకునే వారని అన్నారు. ప్రాన్స్ దేశంలో ఇపుడు కరోనా ఉంది. అయినా అక్కడ ఎన్నికలు జరిపారు. ప్రజలు స్వేచ్చగా 52 శాతం ఓటింగ్ లో పాల్గొన్నారని పేర్కొన్నారు. గోవా లో కూడా త్వరలో ఎన్నికలు జరగ బోతున్నాయని, కాని ఇక్కడ ఎన్నికల అధికారి రమేష్ కుమార్ నిరంకుశత్వం తో ఆరు వారాలు ఎన్నికలు వాయిదా వేశారని మండి పడ్డారు. రాష్ట్రం ను అప్పుల ఊబిలోకి చంద్రబాబు నెట్టాశారని విమర్శించారు. గతంలో సీయం గా ఉన్న సమయంలో 3 లక్షల కోట్ల అప్పుల్లోకి రాష్ట్రాన్ని నెట్టేశారని పేర్కొన్నారు. 14 వ పైనాన్స్ కమీషన్ సిపార్సు మేరకు ఇపుడు కేంద్రం నుండి 5 వేల కోట్లు రాకుండా పోయాయని అన్నారు. ఎన్నికల పరిశీలకులుగా చిత్తూరు జిల్లా లో సిద్దార్థజైన్ ను వేశారని, ఇతను చంద్రబాబు నమ్మిన బంటుల్లో ఒకరన్నారు. అతన్ని కుట్రపూరితంగా ఈ జిల్లాకి పరిశీలకునిగా పంపి, ఇక్కడ అధికారులపై చర్యలు తీసుకునేలా ప్లాన్ చేసింది చంద్రబాబేనని పెద్దిరెడ్డి ఘాటుగా విమర్శించారు.