YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కరోనా వైరస్‌ వ్యాప్తి ప్రజా రవాణాపై తీవ్ర ప్రభావం

కరోనా వైరస్‌ వ్యాప్తి ప్రజా రవాణాపై తీవ్ర ప్రభావం

కరోనా వైరస్‌ వ్యాప్తి ప్రజా రవాణాపై తీవ్ర ప్రభావం
హైదరాబాద్‌, మార్చి 18
కరోనా వైరస్‌ వ్యాప్తి ప్రజా రవాణాపై ప్రభావం కన్పిస్తోంది. ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులు కలసి ప్రయాణించటం ప్రస్తుత పరిస్థితిలో క్షేమం కాకపోవటంతో క్రమంగా రాకపోకలు తగ్గించేలా ప్రభుత్వం ఏర్పాట్లు ప్రారంభించింది. ఇందులో భాగంగా కేంద్రం ఇప్పటికే అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. ఫలితంగా రైల్వే శాఖ రైళ్లను నియంత్రించే చర్యలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో పలు రైళ్లు రద్దు య్యాయి.అలాగే తెలంగాణ ఆర్టీసీపై కరోనా వైరస్‌ ప్రభావం పడింది. తెలంగాణలో ఆర్టీసీ ప్రయాణికుల రద్దీ తగ్దింది. ప్రయాణికులు లేకపోవడంతో రద్దీగా ఉండే బస్టాండ్లు వెలవెలబోతున్నాయి. ఈ నెల 31 వరకూ పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో నగర వాసులు పల్లెబాట పట్టారు. మరోవైపు షిర్డీ ఆలయాన్ని మంగళవారం నుంచి మూసేసిన నేపథ్యంలో షిర్డీ సర్వీసులను మాత్రం రద్దు చేసింది. మహారాష్ట్రలోని ఉద్గీర్‌కు నాలుగు సర్వీసులు తగ్గించిందికాగా, కోవిడ్‌ ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో రైళ్లలో ఆహారం సరఫరా నిలిపేయటమే శ్రేయస్కరమన్న అభిప్రాయం రైల్వేలో వ్యక్తమవుతోంది. దీంతో ప్యాంట్రీకార్లను తాత్కాలికంగా నిలిపివేసి, ప్రయాణికులే సొంతంగా ఆహారాన్ని తెచ్చుకునేలా పిలుపునివ్వాలన్న ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. దీనిపై మరో రెండు మూడు రోజుల్లో నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

Related Posts