YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

నాలుగోసారి ఎన్నికలకు కర్నూలు సిద్ధం

నాలుగోసారి ఎన్నికలకు కర్నూలు సిద్ధం

నాలుగోసారి ఎన్నికలకు కర్నూలు సిద్ధం
కర్నూలే, మార్చి 19, ఒకప్పుడు ఆ జిల్లా రాజధాని... రాయలసీమ జిల్లాలకు ముఖ ద్వారం... రెండు రాష్ట్రాల మధ్య ఉండే జిల్లా కర్నూలు ... అయితే  మున్సిపల్ కార్పోరేషన్ ఏర్పాటు చేసినప్పటి నుంచి సమస్యలు విలయతాండవం చేస్తున్నాయి... అధికారులు మారినా.. ప్రభుత్వాలు,పాలకులు మారినా .. తమ తలరాతలు మాత్రం మారవని అంటున్నారు కర్నూలు నగర ప్రజలు.... కర్నూలు నగర పాలక సంస్థ ఏర్పాటు అయినప్పటి నుంచి తిష్ట వేసిన సమస్యల పై స్పెషల్ స్టోరీ..ఇది కర్నూలు నగర పాలక సంస్థ... జనాభా 6లక్షల 50 వేల మంది... అందులో 3లక్షల 56 వేల మందికి ఓటు హక్కు ఉంది.. అలాగే నగరం లో దాదాపు 52 వార్డులు ఉన్నాయి...   ముందు పురపాలక శాఖ ఏర్పడింది.. ఆ తరవాత జనాభా ప్రాతిపదికన1994 లో  కార్పొరేషన్ గా మారింది...  కార్పొరేషన్ మారిన తరువాత  జరిగిన మొదటి ఎన్నికల్లో  టీడీపీ విజయం సాధించింది. అలా మొదట జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ జెండా రెప రెప లాడినా.. ఐదేళ్ల తరవాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ గెలించింది..  అలా రెండు పర్యాయాలు అంటే 2001, 2006 జరిగిన మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ మేయర్ పీఠాన్ని దక్కించుకుంది.. ఆ తరవాత  మళ్ళీ ఇపుడు  ఎన్నికలు వచ్చాయి.. అంటే దాదాపు 10 ఏళ్ల పాటు ప్రత్యేక అధికారులు పాలించినా నగరంలో మాత్రం సమస్యలు ఎప్పటికపుడు  పెరుకుపోతున్నాయి.. మూడు సార్లు పార్టీలు పాలించారు.. కానీ కర్నూలు నగర అభివృద్ధికి మాత్రం పాటు పడలేదు...  కొత్తగా కార్పొరేషన్ అయింది అని సంబరం పడిన కర్నూలు నగర ప్రజల ఆశలు ఆడియాసలయ్యాయి... పాలకులు వచ్చారు.. అధికారులు మారారు.. నగరంలో ఉన్న ప్రధాన సమస్యలు త్రాగు నీటి, డ్రైనేజీ వ్యవస్థలో మార్పు, ట్రాఫిక్ సమస్య ఇలా అనేకం తిరిపోతాయని భావించారు..కర్నూలు నగర ప్రజలకు  డ్రైనేజీ, చెత్తా చెదారం ప్రధాన సమస్యగా పట్టి పీడిస్తుంది... నగర పాలక సంస్థ ఏర్పాటు అయిన నుంచి చెత్తా ఎక్కడ వేసిన గొంగళి మాదిరిగా మారిపోయింది.. నగరంలో ఉన్న ప్రధానమైన వీధి ఓల్డ్ టౌన్ ( పాత బస్తి ఏరియాలో డ్రైనేజీ కాల్వలు పొంగిపొర్లుతున్నాయి.. కార్పొరేషన్ లో  మరో ప్రధానమైన సమస్య త్రాగునీరు... నగరానికి  పక్కన ఆనుకోని ప్రవహిస్తున్న తుంగ భద్ర ఉన్న... ఎపుడు సమస్యనే... ఎండాకాలం వచ్చిందంటే చాలు... నగర వాసులు నరకయాతన అనుభవించాల్సిందే... 52 వార్డులున్నా నగరంలో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా ఉన్న.. తాగేందుకు మాత్రం చుక్కనీరు కూడా ఉండని పరిస్థితి... సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఉన్న.. సమస్య మాత్రం అలాగే ఉండిపోయింది...ఇంకో సమస్య ట్రాఫిక్... జిల్లాకు చుట్టు పక్కల ఉన్న పలు మండలాల ప్రజలు బతుకుదెరువు కోసం నగరానికి వస్తున్నారు.. జనాభా పెరుగుతోంది.. దింతో ఆటో లతో పాటు వాహనాల సంఖ్య భారీగా పెరిగిపోయింది... దింతో నగరంలో అడుగు తీసి పెట్టాలన్న నగర వాసులు భయాందోళనకు గురవుతున్నారు..ఇంకో సమస్య... అండర్ బ్రిడ్జి నిర్మాణం...  తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నుంచి కర్నాటక రాష్ట్రం బెంగళూరు కు వెళ్ళాలంటే కర్నూలు మీదుగా వెళ్ళాలి.. జాతీయ రహదారి కల్లూరు, కర్నూలు నగర పరిధిలో ఉంది.. దింతో ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకున్నాయి.. కల్లూరు ఐటీసీ దగ్గర దాదాపు వందల మంది ప్రాణాలు పోయాయి.. దింతో నగర వాసులు అక్కడ అండర్ బ్రిడ్జి చేపట్టాలని ఉద్యమాలు చేశారు.. కానీ ఆ కల నెరవేరలేదు.. ఇలా ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నా కర్నూలు నగర పాలక సంస్థ.. ఇప్పటికైనా అధికారులు స్పందించి కొత్త పాలక వర్గం ద్వారా సమస్యలను తీర్చాలని నగర వాసులు కోరుతున్నారు.. ఈ ఎన్నికల్లో గెలిచిన ప్రజా ప్రతినిధులు కూడా సమస్యల పై దృష్టి సారించి నగర అభివృద్ధి కోసం పాటు పడాలని కోరుతున్నారు...

Related Posts