YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

పాడి రైతులకు కష్టకాలం

పాడి రైతులకు కష్టకాలం

పాడి రైతులకు కష్టకాలం
తిరుపతి, మార్చి 19,  చిత్తూరు జిల్లాలో పాడి రైతుకు అప్పుడే కష్టకాలం మొదలైంది. పాల ఉత్పత్తిలో దేశంలోనే చిత్తూరు జిల్లా నెంబర్ వన్‌ స్థానంలో ఉంది..  ప్రస్తుతం ఆ రైతులకు పశుగ్రాసం కొరత ఉండి.. ఎండుగడ్డి ధరలు భగ్గమంటున్నాయి. మార్చిలోనే ఇలా ఉంటే మరో 3నెలలు ఎలా అంటున్నారు పాడి రైతులు.మార్చి నెలలోనే ఎండుగడ్డికి బాగా డిమాండు పెరిగిందంటే..  రానున్న నాలుగైదు నెలల పరిస్థితి ఎంటనేది ప్రశ్నార్థకంగా మారింది. పశుగ్రాసం దొరక్క... ఎండుగడ్డి లేక జిల్లాలో పాడిరైతులు పడరాని పాట్లు పడుతున్నారు. గతేడాది జిల్లాలో బారీగా వర్షాలు కురిసినా.... ప్రస్తుతం భూగర్బజలాలు అడుగంటిపోయాయి. మామూలుగా జిల్లాలో మార్చి నుంచి జూన్‌ వరకు ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి.అయితే దానికి తగ్గట్టుగా పాడి పశువులకు పశుగ్రాసం అందడం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిత్తూరు జిల్లాలో 12. 05 లక్షల పశుసంతతి ఉంది. వీటిద్వారా రోజుకు 35 లక్షల నుంచి 40 లక్షల లీటర్ల వరకు పాల ఉత్పత్తి జరుగుతోంది. ఒక పశువుకు రోజుకు 5 కేజీల పచ్చిగడ్డి, ఎండుగడ్డి, దాణా అవసరం. జిల్లాలోని 12. 05 లక్షల పశువులకు రానున్న 90 రోజులకు 5. 42 లక్షల టన్నుల పశుగ్రాసం అవసరం. అయితే 5. 01 లక్షల టన్నుల పశుగ్రాసం మాత్రమే అందుబాటులో వుంది. అయితే 41 వేల టన్నుల గ్రాసం కొరతుంది. పశుగ్రాసం కొరత తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం గతేడాది అమలు చేసిన పథకాలన్నీ ప్రస్తుతం అమలులో ఉన్నా..  నామమాత్రంగానే కొనసాగుతున్నాయి. చిత్తూరు జిల్లాలో పడమటి మండలాల్లో పశుగ్రాసం కొరత తీవ్రంగా వుంది. దాంతో తూర్పు ప్రాంతానికి చెందిన శ్రీకాళహస్తి, ఏర్పేడు, బీఎన్‌ కండ్రిగ, వరదయ్య పాళెం తదితర మండలాల నుంచి ఎండుగడ్డిని లారీలు, ట్రాక్టర్లలో తెచ్చుకుంటున్నారు పాడి రైతులు. అక్కడ ఒక్క ట్రాక్టరు గడ్డి 6 వేల నుంచి 8వేల వరకు ధర పలుకుతోంది. అక్కడి వ్యాపారులు పడమటి మండలాలకు తీసుకొచ్చి ఒక ట్రాక్టరు ఎండుగడ్డి  11 వేల నుంచి 13 వేల వరకు అమ్ముకుంటున్నారు. పూతలపట్టు మండలంలోని రంగంపేట క్రాస్‌, పాకాల మండలంలోని నేండ్రగుంట తదితర ప్రాంతాల్లో రోజుకు 20 నుంచి 25 లోడ్ల ఎండుగడ్డి విక్రయం జరుగుతోందంటే గడ్డికి ఎంత డిమాండ్‌ ఉందో తెలుస్తోంది. జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలు ఉంటే దాదాపు 10 నియోజకవర్గాల్లో చాలా మంది రైతులు ఈ పాడి పరిశ్రమ పైనే ఆధారపడి ఉంటారు. కానీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉండడం... జిల్లాలో పశుసంవర్థక శాక అధికారులు పాడిరైతుల కష్టాలు పట్టించుకోకపోవడంతో మరిన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇకనైనా దేశంలోనే మొదటి స్థానంలోని ఈ జిల్లా పాడిరైతులు ఇబ్బందులు గుర్తించి... త్వరితగతిన ఉన్న సమస్యలు తీర్చాల్సి అవసరం ఉంది. లేదంటే పాల ఉత్పత్తి తగ్గిపోయే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతోంది...

Related Posts