దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ స్వల్పంగా 50 పాయింట్లు మాత్రమే లాభపడుతూ... 33,306 వద్ద, నిఫ్టీ 14 పాయింట్ల లాభంలో 10,225 వద్ద ట్రేడవుతున్నాయి. నిఫ్టీ మెటల్, ఫార్మా, ఐటీ సూచీలు బలహీనంగా కొనసాగుతున్నాయి. దాంతో పాటు మిడ్‌క్యాప్ ఇండెక్స్ కూడా నష్టాల్లోనే నడుస్తోంది. అమెరికా ఉత్పత్తులపై చైనా అదనపు టారిఫ్‌లు ఫలితంగా ట్రేడ్ వార్ ఆందోళనలు రేకెత్తి అమెరికా స్టాక్ మార్కెట్లు క్రాష్ అయ్యాయి. ఈ ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపైనా పడింది.