YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

కల నిజమాయెనా !  కోరిక తీరేనా !! 

కల నిజమాయెనా !  కోరిక తీరేనా !! 

కల నిజమాయెనా !  కోరిక తీరేనా !! 

వేడివేడి ఉప్మా తింటుంటే అల్లం ముక్క నోటికి తగిలినట్టూ
దోరగా వేగిన పెసరట్టు కొరికితే జీడిపప్పు పంటికిందకి వచ్చినట్టూ
మిర్చిబజ్జి ఆబగా తినబోతే నాలిక సుర్రుమన్నట్టూ
పక్కనే ఉన్న వొగ్గాణీ గుప్పెడు బొక్కినట్టూ
పచ్చిమిరపకాయలు తగిలించి రోట్లో తొక్కిన టమాట పచ్చడి పేద్ద ముద్దలు కలిపినట్టూ
మామిడికాయ బద్ద నవులుతూ గుండమ్మ కథ సినిమా చూస్తున్నట్టూ
పీకల్దాక పెరుగన్నం తినేసి ఉసిరికాయ బుగ్గనెట్టుకున్నట్టూ
దిబ్బరొట్టె మొత్తం నేనే తినేసినట్టూ
వేపచెట్టుకింద మడతమంచమెక్కి చెంబుడు నిమ్మకాయమజ్జిగ తాగి పడుకున్నట్టూ
చద్దన్నంలో ఆవకాయ వాయకలిపినట్టూ
పప్పుచారులో గిన్నెడు చిన్నుల్లిపాయలు, దోసకాయ, బెండకాయ, ములక్కాయ ముక్కలు తేల్తున్నట్ట
రోడ్ మీద కొబ్బరి బొండాం కొట్టించుకుంటే లేత కొబ్బరి ఉన్నట్టూ
లేత లేత ముంజెలు వేలితో పొడుచుకుని లెక్కెట్టకుండా తిని మూతి తుడుసుకున్నట్టూ
కమ్మగా ఉడికిన ముద్దపప్పు అన్నం కి దోసబద్దల పచ్చడి తోడైనట్టూ
చుక్కకూర పప్పు కుతకుతలాడించి వేడి వేడిగా అమ్మ చపాతీ చేసినట్టూ
నూకలన్నంలో వెన్నతీయని మజ్జిగపోసుకుని జుర్రినట్టూ
పులగం అన్నం లో కి ఘాటుగా పచ్చిపులుసు పోసినట్టూ
చెట్టునుంచి తెంపుకొచ్చిన లేత వంకాయలు మగ్గీ మగ్గగానే పళ్ళెంలోకి వడ్డించినట్టూ
సావిట్లో గేదెలకి పోటీపడి తేగలు తెగ తినేసినట్టూ
దోర పచ్చికొబ్బరి లోకి బెల్లం గెడ్డ జత కుదిరినట్టూ
తిరుపతి లడ్డూ మొత్తం అచ్చంగా నాకే ఇచ్చేసినట్టూ
పరపరలాడే పచ్చిమామిడికాయలు ఉప్పూ కారం దట్టించి కొరికినట్టూ
పండిన వేపకాయ ఎవరూ చూడకుండా చీకిపారేసినట్టూ
టమాటా పప్పుకి తోడు ఊరమిరపగాయలూ వడియాలూ అప్పడాలతో వచ్చినట్టూ
మసాలా చాయ్ ముంతమసాలాతో తాగినట్టూ
బంగినపల్లి మామిళ్ళు పరకలకొద్దీ తినేసినట్టు
వేడి వేది బెల్లం జిలేబీ రోడ్ మీద కొనీ కొనగానే కారు డోర్ వేసుకుని గుటుక్కుమనిపించినట్టు
బొగ్గులమీద కాల్చిన మొక్కజొన్న పొత్తులు ఒలుచుకు తిన్నట్టూ
లోటాడు మద్రాస్ ఫిల్టర్ కాఫీ స్టార్ బక్స్ లో దొరికినట్టూ
బట్టీలోంచి తెచ్చిన బఠాణీలు పటపట మని నమిలేసినట్టూ
అలా చెట్టునుంచి దూసిన కరేపాకు తాలింపులో వేసి కొత్తటుకులు వేయించినట్టూ
సినిమా హాల్ లో పాప్కార్న్ ఎవరన్నా తెచ్చిపెట్టినట్టూ
చిన్నా పెద్దా తేడాలేకుండా రసాలు గుటకలేసినట్టూ
కొబ్బరి బూరెల కోసం చేసిన చలివిడి కొట్టేసి తిన్నట్టూ
బిడ్డనెత్తుకొచ్చిన సారెలో పంచదార చిలక నాకే ఇచ్చినట్టూ
కొబ్బరి మామిడికాయ ముక్కలు కేజీలు ఖాళీ చేసినట్టూ
మా పెద్ద రేగు చెట్టు ఇంకా బిందెలు బిందెలు కాయలు కాస్తున్నట్టూ
కిస్మిస్ లని కేజీల్లో మాయం చేసేసినట్టూ
దోర జాంకాయాలు కాయలు చెట్టునుంచి ఎతికెతికి కోసుకుని పరపరా నమిలేసి తిన్నట్టూ
సన్నసెగన మరగకాగిన ఉలవచారు తాలింపు ఘుప్పుమన్నట్టూ
వానాకలంలో పకోడీల వాసన గాలిలో తేలివచ్చినట్టూ
తంపడకాయలు, కాల్చిన పచ్చేరుసెనక్కాయలు కలిసి దొరికినట్టూ
పుల్లైసు బండి పరిగెత్తకుండానే మన గుమ్మం ముందే ఆగినట్టూ
పొట్ట పగిలిపోడానికి రడీగా ఉన్న సీతాఫలం చెట్టునేమగ్గి దొరికినట్టూ
దోరగా పండిన చింత కాయ చిటుక్కున చేతికి అండినట్టూ
పాలసపోటా చెట్టుకింద నిలబడి అలాగ్గా కోసుకు తిన్నట్టూ
చిన్నుసిరికాయల చెట్టు స్కూలుకెళ్ళే దారిలో కొమ్మజాపి రమ్మన్నట్టూ
ఎర్రగా వేగిన బంగాళా దుంప కూరకి రసం తోడైనట్టూ
వాక్కాయల చెట్టొకటి తోవెమ్మటే ఉండి రారమ్మన్నట్టూ
కణుపు చిక్కుళ్ళు చట్టినిండా ఉడకబెట్టి అమ్మ వాకిట్లోకి వెళ్ళినట్టూ
మామిడితాండ్ర పొరలుపొరలు తీసితింటూ ముచ్చట్లు చెప్పుకున్నట్టూ
సాంబారు పెట్టిన్నాడే దొండకాయ వేపుడు కూడా చేసినట్టూ
ఎర్రని సీమతుమ్మకాయలు కొక్కెం ఊడిపోకుండానే ఒడినిండా దొరికినట్టూ
గుళ్ళో పక్కనోళ్ళు వాళ్ళ వాటా పులిహోర కూడా నాకే ఇచ్చినట్టూ
వగరేతెలియని కండపట్టిన నేరేళ్ళకొమ్మ చేతికందినట్టూ
విరగ కాసిన ఈత చెట్టొకటి పిలిచి కాయలిచ్చినట్టూ 
బెల్లం గవ్వలు ఒక పిసరు పాకం తక్కువై తీగ సాగినట్టూ
వర్షం పడుతుంటే పునుగుల పళ్ళెం చేతిలోకి వచ్చినట్టూ 
వేయించిన ఎండుమిరపకాయలు వెల్లుల్లి వేసి రోట్లో తొక్కిన గోంగూర పచ్చడి వెన్నపూసేసుకుని వాయ కలిపినట్టూ
భోజనాల బల్ల దగ్గర ప్రశాంతంగా కూర్చుని పాలుపోసిన కూర లో ములక్కాయ ముక్కల్ని ఓ పట్టుపట్టినట్టూ
ఆవడల మీద బూందీ మిక్చరు వేసుకుని మిట్టమధ్యహ్నం ఎండలో హాయిగా తింటున్నట్టూ
పూరీలు పున్నమి చంద్రుళ్ళా పొంగి, కమ్మని కూరతో తెగతిన్నట్టూ
ఉల్లిపాయలు జీలకర్ర కరేపాకు దిట్టంగా వేసిన రవ్వట్టు భూదేవంత సైజులో పెట్టినట్టూ
గడ్డపెరుగులో నిమ్మకాయ బద్ద నంజుకుని నాకేసినట్టు
పానిపూరీలు లొట్టలేసేంత పుల్లగా వర్రగా కుదిరినట్టూ
దప్పళం గిన్నె మొట్టమొదలు నాకే ఇచ్చినట్టూ
ఆఖరికి ఏడేడి ఇడ్లీలు దూదిలా మెత్తగా పొగలు కక్కుతుంటే నేతిగిన్నెలో ముంచి కారప్పొడి అద్దినట్టూ
*కమ్మని కలలు కంటూ మాంచి నిద్రలో ఉంటే,* 
కుళ్ళుమోతు అలారం పీడకలొచ్చినట్టు మోగిచచ్చింది!  
ఛస్ !!  

Related Posts