పదో తరగతి పరీక్షలు రాస్తున్న వీణా వాణీలు
బెస్ట్ విషెస్ చెప్పిన మాగంటి గోపీనాథ్
హైదరాబాద్, మార్చి 19
అవిభాజ్య కవలలు అయిన వీణా వాణీలు పదో తరగతి పరీక్షలు రాస్తున్నారు. నేడు అందరు విద్యార్ధులలాగానే వారు కూడా పరీక్షా కేంద్రానికి వచ్చారు. అవిభాజ్య కవలలుగా పేరు పొందిన వీణా వాణీ పరీక్షలు బాగా రాయాలని ఆకాంక్షిస్తూ మధురానగర్ లోని వారి పరీక్షా కేంద్రం వద్దకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వచ్చారు.వారు పరీక్షా కేంద్రానికి వెళుతుండగా వారిని కలిసి వారికి బెస్ట్ విషెస్ చెప్పారు. పరీక్షలు బాగా రాయాలని మాగంటి గోపీనాథ్ ఆకాంక్ష్చారు. వారికి పరీక్షకు అవసరమైన పెన్ను, పెన్సిల్ అందచేసి గ్రీటింగ్స్ చెప్పారు. ఎమ్మెల్యే అయి ఉండి తమ కోసం ఇంత దూరం వచ్చి తమకు గ్రీటింగ్స్ చెప్పిన మాగంటి గోపీనాథ్ కు వీణా వాణీ థ్యాంక్స్ చెప్పారు.