YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కరోనా వైరస్‌ ప్రభావం 168 రైళ్లను రద్దు

కరోనా వైరస్‌ ప్రభావం 168 రైళ్లను రద్దు

కరోనా వైరస్‌ ప్రభావం 168 రైళ్లను రద్దు
హైదరాబాద్‌, మార్చి 19
కరోనా వైరస్‌(కోవిద్‌-19) ప్రభావం రైల్వేశాఖ మీద కూడా పడింది. దేశంలో నిత్యం లక్షలాది మంది రైళ్లలో పయణిస్తారన్న విషయం తెలిసిందే. దీంతో, వైరస్‌ వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యగా రైల్వేశాఖ అధికారులు 168 రైళ్లను రద్దు చేశారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా మార్చి 20 నుంచి 31 వరకు రైళ్లు రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. ముందస్తుగా టికెట్‌ బుక్‌ చేసుకున్న ప్రయాణికులకు వ్యక్తిగతంగా సమాచారం అందిస్తామని రైల్వేశాఖ ప్రకటించింది.  మరోవైపు భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 169కి చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. మృతుల సంఖ్య మూడుకు చేరుకుంది. దేశంలో కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ ఇవాళ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. 
 

Related Posts