ఇంద్రకీలాద్రిలో సేవలు నిలిపివేత
విజయవాడ మార్చి 19
కరోనా వ్యాపిస్తున్న క్రమంలో మార్చి 31 వరకు ఇంద్రకీలాద్రిలో అన్నిసేవలు నిలుపుదల చేస్తున్నాం. అమ్మవారి అంతరాలయ దర్శనాలను రద్దు చేశాం. కరోనా నేపద్యంలో అన్ని ఆర్జిత సేవలను నిలుపుదల చేశామని దుర్గగుడి చైర్మన్ పైలా సోమినాయుడు వెల్లడించారు. గురువారం అయన మీడియాతో మాట్లాడారు. అమ్మవారి బస్సులను, లిఫ్టులను, కేశఖండనశాల నిలుపుదలచేశాం. అమ్మవారిని దర్శించు కోవడానికి వచ్చే భక్తులకు శానిటైజేషన్ లిక్విడ్ అందచేస్తున్నాం. భక్తులు అందరిని చెక్ చేసిన తరువాతే దర్శనానికి అనుమతిస్తున్నాం. దేశప్రజల ఆయురారోగ్యాలతో ఉండాలని హోమాలు జరిపిస్తున్నామని అన్నారు.ఆలయ ఈవో సురేష్ బాబు మాట్లాడుతూ ఉగాది రోజు పంచాగశ్రవణం , అమ్మవారి సేవలకు ఎవరికి అనుమతి లేదు. అమ్మవారికి జరిగే సేవలు నిరంతరం కొనసాగుతాయి. భక్తులు ఎవరైనా ముందుగా సేవలను బుక్ చేసుకుని ఉంటే వారి పేరున సేవలు నిర్వహిస్తాము, లేదా డబ్బు చెల్లిస్తామని అన్నారు. ప్రతి రెండు గంటలకు ఒకసారి పరిసరాలను శుభ్రపరుస్తున్నాం. మహామండపంనుంచి మెట్ల మార్గము ద్వారా ఘాట్ రోడ్జు మార్గాలలో నే భక్తులకు అనుమతి వుంటుంది. చిన్నపిల్లలు , వృద్దులు , గర్బిణీలు దర్శనానికి రాకపోవడం మంచిది. పొంగలి , కదబం , దద్దోజనం వంటి ప్రసాదాలు ప్యాకెట్లరూపంలో అందిస్తున్నామని అన్నారు. కరోనా వలన గత నాలుగైదు రోజులుగా భక్తులు తగ్గారు. ఆదాయం కూడా చాలా వరకు తగ్గింది. ఇంకో 5 కోట్ల వరకు ఆదాయం తగ్గవచ్చని అయన అన్నారు.