Highlights
- పరిశీలనలో రెండు రకాల డ్రెస్సులు
- తుది నిర్ణయానికి రాని పోలీస్ బాస్
తెలంగాణ రాష్ట్రంలో మహిళా కానిస్టేబుళ్ల యూనిఫారంను మార్చేందుకు తీవ్ర కసరత్తు జరుగుతుంది. . బహిరంగ ప్రదేశాల్లో నిరసనకారులను అదుపుచేసే విషయంలో మహిళా కానిస్టేబుళ్లు ప్రస్తుత డ్రెస్ కోడుతో మహిళా కానిస్టేబుళ్లు తమ విధుల్లో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు తాము గుర్తించామని రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి వెల్లడించారు. అందువల్లే వారి కోసం కొత్త డ్రెస్ కోడును ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామని, కానీ, దీనిపై తుది నిర్ణయం తీసుకోలేదని ఆయన చెప్పారు.
కాగా మాహిళా కానిస్టేబుళ్ల కోసం రెండు రకాల డ్రెస్ కోడ్‌లను ఎంపిక చేసింది. నడుము వరకు ఉండే కోటుతో ప్యాంటు-చొక్కా, అలాగే నడుము వరకు ఉండే కోటుతో సల్వార్ కమీజ్ లాంటి రెండు డిజైన్లను రూపకల్పన చేసింది. ఈ డిజైన్లను ఆకాంక్ష మహేశ్వరి రూపొందించారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ పూర్వ విద్యార్థి అయిన ఆమె నగరంలోని ఐ-బ్రాండ్ సంస్థలో క్రియేటివ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నారు.