కనీసం 15 నిమిషాల పాటు ఎండలో గడపండి
కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి
న్యూ డిల్లీ, మార్చి 19
ప్రజలు కనీసం 15 నిమిషాల పాటు ఎండలో గడపాలని కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి అశ్విని కుమార్ చౌబే సూచన చేశారు. ఇవాళ ఆయన పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. సూర్యరశ్మిలో ఉండడం వల్ల విటమిన్ డి లభిస్తుందని, దాని వల్ల ఇమ్యూనిటీ పెరుగుతందని, దాని వల్ల నోవెల్ కరోనా లాంటి వైరస్‌లు కూడా చనిపోతాయని మంత్రి తెలిపారు.మహారాష్ట్రలో డబ్బావాలాలు తమ సేవలను నిలిపేశారు. మార్చి 20వ తేదీ నుంచి 31వ తేదీ వరకు సేవలను రద్దు చేస్తున్నట్లు డబ్బావాలాలు పేర్కొన్నారు. మహారాష్ట్రలో అత్యధిక సంఖ్యలో కేసులు నమోదు కావడం వల్ల ఆ రాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే కూడా కొన్ని సూచనలు చేశారు. ప్రజలు ప్రయాణాలను రద్దు చేసుకోవాలన్నారు. కరోనాతో యుద్ధం చేస్తున్నామని, ప్రస్తుతం పరిస్థితి క్లిష్టంగా లేకున్నా.. ఆందోళనకరంగా ఉందన్నారు.