YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

తొలి తెలుగు పరీక్ష ప్రశాంతం

తొలి తెలుగు పరీక్ష ప్రశాంతం

తొలి తెలుగు పరీక్ష ప్రశాంతం
-36మంది విద్యార్థులు గైర్హాజరు
- డీఈవో గోవిందరాజులు
నాగర్ కర్నూలు, మార్చి 19
నాగర్ కర్నూలు జిలాల్లో గురువారం  ప్రారంభమైన పదో తరగతి మొదటి పరీక్ష ప్రశాంతంగా సాగింది. తొలి రోజు ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు, ఉర్దూ, భాషల పరీక్షా నిర్వహించారు. నాగర్ కర్నూల్ లో తొలిపరీక్షకు 11129 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 11093 మంది విద్యార్థుల హాజరయ్యారు.  36మంది విద్యార్థులు గైర్హా జరయ్యారు. ప్రైవేటు పరీక్షా కేంద్రంలో విద్యార్థులు 5 మందికి 5 మంది హాజరయ్యారు.  జిల్లాలో 15 మంది అధికారుల పర్యవేక్షణలో పరీక్షలను నిర్వ హించారు. డిఇవో గోవిందరాజులు, ఉదయం ఎనిమిది గంటలకు డీఈఓ కార్యాలయం నుండి 54 పరీక్ష కేంద్రాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరీక్ష కేంద్రాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు అందించారు. జిల్లా కేంద్రంలోని కొనసాగుతున్న 7 పరీక్షా కేంద్రాలను డిఇఓ గోవిందరాజులు సందర్శించారు. పరీక్షా కేంద్రాల వరకు ఆర్టీసీ బస్సులు విద్యార్థులను వదిలేశాయి, ప్రతి పరీక్షా కేంద్రంలో శానిటైజర్ ఏర్పాటు చేశారు. కొంతమంది విద్యార్థులు మాక్స్ ధరించి స్వతహాగా వాళ్లే శానిటైజర్లును తెచ్చుకునీ పరీక్షలకు హాజరయ్యారు.   పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు ఫ్లైయ్యింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశామని డీఈఓ తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో సెల్ఫోలను అనుమతించలేమని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. పరీక్ష కేంద్రాలకు దగ్గర ఉన్న జిరాక్స్ సెంటర్లను మూయించినట్లు డీఈఓ  తెలిపారు. జిల్లా కేంద్రంలో లిటిల్ ఫ్లవర్, గీతాంజలి, నేషనల్ హై స్కూల్, గవర్నమెంట్ హై స్కూల్, సి ఎన్ ఆర్ మెమోరియల్ స్కూల్, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల్లో ఏర్పాటు చేసిన ఎనిమిది పరీక్షా కేంద్రాలను డీఈవో గోవిందరాజులు, ప్రభుత్వ పరీక్షల నిర్వహణాధికారి రాజశేఖరరావు, ఏడి అశోక్, నోడల్ అధికారి కురుమయ్య, జిల్లా సైన్స్ అధికారి కృష్ణారెడ్డి, సెక్టోరల్ అధికారి మంతటి నారాయణ, ఎస్ పి సి ప్రసాద్ గౌడ్ ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ నాగరాజు, ఎస్ జి ఎఫ్ వెంకటయ్య, స్ట్రాంగ్ టీచర్ వెంకటేశ్వర శెట్టి పరీక్షా కేంద్రాలను సందర్శించారు. జిల్లా వ్యాప్తంగా ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 32 పరీక్షా కేంద్రాలను సందర్శించి, ఎలాంటి మాల్ప్రాక్టీస్ కు తావు లేకుండా పరీక్షలు పకడ్బందీగా నిర్వహించారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద  ఆరోగ్య శాఖ వారి సిబ్బంది తో విద్యార్థుల ఆరోగ్య సమస్యలపై అత్యవసర ప్రాథమిక చికిత్స అందించేందుకు హెల్త్ సూపర్వైజర్ లతో ఓ.ఆర్.యస్. ప్యాకెట్లు ట్యాబ్లెట్లను ఏర్పాటు ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్బందీగా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.

Related Posts