పంచారాంమంలొ హోమాలు
పాలకొల్లు, మార్చి 19
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ను ఆంధ్రప్రదేశ్ నుండి తరిమి కొట్టేందుకు దేవాదాయ శాఖ అన్ని గ్రామాలలోని ఆలయాలలో హోమాలు నిర్వహించాలని ఆదేశాలు ఇవ్వడం తో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు లో పంచారామ క్షేత్రం శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయం లో అరుణ,మహా ధన్వంతరీ,మహా మృత్యాంజయ హోమాల ను ఆలయ అర్చకులు వేద మంత్ర ఉచ్చరణ ల మధ్య నిర్వహించారు. ఈ హోమాలు లో ఉపయోగించే ఆవు నెయ్యి, ఔషధ గుణాలు కలిగిన యాలకులు,జాజి,జాపత్రి,తదితర వస్తువులు వలన వెలువడే పొగ ద్వారా గాలిలో వ్యాపించి ఉన్న విష వాయువులు నసిస్తాయని . దీని వలన కరోనా వైరస్ కూడా నసిస్తుందని అంటున్నారు. సనాతన భారతీయ సంస్కృతి కి ప్రాధాన్యత ఉందని అందుకే ఇప్పుడు ప్రపంచం మొత్తం మన భారతీయ సంస్కృతి వైపు చూసి ఆకర్షితులై అవలంబిస్తున్నారని ఆలయ అర్చకులు,పండితులు చెబుతున్నారు.