YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం విదేశీయం

 కరోనా వైరస్ దెబ్బకు కుప్పకూలుతున్న ప్రపంచ స్టాక్ వ్యవస్థ 

 కరోనా వైరస్ దెబ్బకు కుప్పకూలుతున్న ప్రపంచ స్టాక్ వ్యవస్థ 

 కరోనా వైరస్ దెబ్బకు కుప్పకూలుతున్న ప్రపంచ స్టాక్ వ్యవస్థ 
న్యూ డిల్లీ, మార్చి 19
కరోనా వైరస్ ధాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు తోడు భారత ఆర్థిక వ్యవస్థ కూడా తీవ్రంగా ప్రభావం చూపుతోంది. ఇప్పటికే స్టాక్ మార్కెట్లు కోలుకోవడం లేదు. లక్షల కోట్ల సంపద ఆవిరవుతోంది. నిఫ్టీ సెన్సెక్స్ చరిత్రలో లేని విధంగా నేల చూపు చూస్తున్నాయి. బేర్ మంటూ స్టాక్ వ్యవస్థ కుప్పకూలుతున్నాయి. ఇప్పుడు కరోనా ప్రభావం దేశీయ కరెన్సీపై కూడా పడింది. కరోనా వైరస్ తన ప్రతాపం చూపుతుండడంతో ఒక్కసారిగా రూపాయి విలువ పడిపోయింది. డాలరుతో మారకంలో రూపాయి తొలిసారి 75 మార్క్ కిందికు పడిపోవడం గమనార్హం. ఇంటర్బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్ లో రూపాయి బుధవారం ముగింపు 74.25 ఉండగా గురువారం 74.95 వద్ద ప్రారంభమవడంతో 70 పైసల నష్టం చవిచూసింది. ఆ తర్వాత మధ్యాహ్నం వరకు మరింత దిగజారి ఏకంగా 81 పైసలు (1.1 శాతం) 75.08 వద్ద ట్రేడయ్యింది. ఈ విధంగా ఒక్కసారిగా రూపాయి విలువ పడిపోవడం చరిత్రలోనే కనిష్టం ఇది. అయితే దీనికి కారణం కరోనా వైరస్ ప్రభావం తో ఆర్థిక వ్యవస్థలు తీవ్ర ప్రభావం చూపి మాంద్యంలోకి జారుకోవచ్చన్న అంచనాలు ఆందోళనలు ఈక్విటీ మార్కెట్లతోపాటు ముడిచమురు కరెన్సీలను సైతం దెబ్బ తీస్తున్నట్లు స్టాక్ విశ్లేషకులు భావిస్తున్నారు.గతంలో డాలరుతో మారకంలో రూపాయి 74.50 వద్ద రికార్డ్ కనిష్టాన్ని తాకగా ఇప్పుడు ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ తాజాగా వందను కూడా దాటక పోవడంతో దేశీ కరెన్సీ బలహీనపడినట్లు చెబుతున్నారు. ఫారన్ పోర్ట్ పోలియే ఇన్వెస్టర్లు ఇండియన్ మార్కెట్ల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్నారు. కరోనా భయాలతో ఎఫ్ పీఐలు వెనక్కి వెళ్లడం రూపాయి బలహీనానికి ముఖ్య కారణాల్లో ఒకటని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో పాటు మార్కెట్లు కూడా భారీ నష్టాల్లో ఉన్నాయి. ఐటీ ఇండెక్స్ 27 నెలల కనిష్టానికి చేరుకుంది. ఉదయం భారీ నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు ఆ తర్వాత మధ్యాహ్నానికి కాస్త కుదురుకున్నాయి. సెన్సెక్స్ 1700 పాయింట్ల నష్టంతో ప్రారంభమైంది. ఆ తర్వాత 700 పాయింట్లు కుదురుకొని 1000 పాయింట్ల నష్టం వద్ద కొనసాగింది. కరోనా అంతర్జాతీయ పరిణామాలతో మార్కెట్లు కొన్నాళ్లుగా ఊగిసలాడుతున్నాయి. ఎప్పుడో ఒకప్పుడు తీవ్ర పరిణామం స్టాక్ మార్కెట్ లలో చోటు చేసుకునే ప్రమాదం పొంచి ఉంది. అయితే చమురు ధరలు 20 శాతం లాభపడడం విశేషం.

Related Posts