.కరోనా నివారణకు పారాసిటమల్ మాత్రను సిఫారసు చేసిన ఇంగ్లాండ్
హైదరాబాద్, మార్చి 19
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతూ ప్రజలను భయాందోళన రేపుతుంటే ప్రపంచ దేశాలు దాన్ని కట్టడి చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. భారత్ లో కూడా దీని ప్రభావం తీవ్రంగా ఉండగా.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కరోనా వైరస్ పై ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. కరోనా వైరస్ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మొదట తెలంగాణ ముఖ్యమంత్రి అసెంబ్లీ సమావేశాల్లో కరోనా వైరస్ పై మాట్లాడుతూ.. పారాసిటమల్ వేసుకుంటే కరోనా తగ్గుతుంది.. దానిపై పరేషాన్ వద్దు అని పేర్కొన్నాడు. ఇక ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా పారాసిటమల్ మాత్రతో పాటు బ్లీచింగ్ పౌడర్ చల్లితే ఆ వైరస్ కనిపించదని పేర్కొన్నారు. అయితే దీనిపై సోషల్ మీడియాతో పాటు రాజకీయ నాయకులు కూడా విమర్శలు చేశారు. ఈ విధంగా ప్రజలను తప్పుదోవ పట్టించకూడదని చెప్పారు. వారు చెప్పింది విరుద్ధమని విమర్శించారు.అయితే ఇంగ్లాండ్ మాత్రం కేసీఆర్ జగన్ కు ఓ శుభవార్త చెబుతోంది. వారు చెప్పిన మాట వాస్తవమేనని పేర్కొంది. కరోనా నివారణకు పారాసిటమల్ మాత్రను సిఫారసు చేస్తూ ఆ దేశ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఇంగ్లాండ్ నేషనల్ హెల్త్ సర్వీస్ (ఈహెచ్ఎస్) పారాసిటమల్ కరోనా వైరస్ నివారణకు సిఫారసు చేశారు. ఇటీవల ఇంగ్లాండ్ లో ఇదే విషయమై వెల్లడైందంట. కోవిడ్ నివారణకు ఇప్పటివరకు ఒక్క మందు కూడా లభించకపోవడంతో దాని ప్రాథమిక నివారణలో భాగంగా పారాసిటమల్ వినియోగించవచ్చని ఆ దేశ ఆరోగ్య సంస్థ ఒక నివేదికలో వెల్లడించింది. దీంతో కేసీఆర్ జగన్ చెప్పిన మాట వాస్తవమేనని స్పష్టమవుతోంది.పారాసిటమల్ వ్యాఖ్యలపై తెలుగు రాష్ట్రాల్లో ట్రోలింగ్ మొదలై ఆసక్తికర చర్చ సాగింది. ఇప్పుడు ఈ ఇంగ్లాండ్ నివేదిక తో వారు ముక్కున వేలు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇన్నాళ్లు ట్రోల్ చేసిన వారిపై టీఆర్ఎస్ వైఎస్సార్సీపీ నాయకులు బదులు ఇస్తున్నారు. ఇప్పుడు ఏమంటారని ప్రశ్నిస్తున్నారు.