YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం దేశీయం

కామాఖ్యా దేవి

కామాఖ్యా దేవి

కామాఖ్యా దేవి
శ్రీ కామాఖ్య ఆలయం హిందూ మత కేంద్రమే కాకుండా ప్రకృతి మాతకి నిలయం. చుట్టూ నీలాచర పర్వతాలు, తూర్పు వైపు కొండపై వసించిన భువనేశ్వరీ మాత ఆలయం, బ్రహ్మపుత్ర నదీ పరవళ్లు, చుట్టూ అందమైన ప్రకృతి ఒక రకమైన అలౌకిక పారవశ్యాన్ని కలుగజేస్తుంది. కామాఖ్యా దేవి ప్రాగ్జోతిషపురం (గౌహతి) లోని నీలాచల పర్వతాలపై అధిష్టించి ఉంది. రెండు నీలాచల పర్వతాల మధ్య ఉన్న ఓ ఆదిమ తెగలకి చెందిన శాక్తీయులు, ఈ దేవిని ఆరాధించేవారు.  మూలవిరాట్టు ఆలయంలో కామాఖ్యదేవి చుట్టూ ‘పది మహావిద్య’లున్నారు. వీరు - భువనేశ్వరి, బాగలముఖి, చిన్నమస్తకదేవి, త్రిపురసుందరి, తార, కాళిక, భైరవి, ధూమావతి, మాతంగి, కమల. వీరిలో త్రిపురసుందరి, మాతంగి, కమల ప్రధాన ఆలయంలో కొలువుతీరి ఉండగా, మిగతా మహా‘విద్య’లు ప్రధాన ఆలయం చుట్టూ వున్న ఆలయాల్లో పరివేష్ఠించారు. గర్భ గృహాలయంలోని ఒక చిన్న చీకటి గుహ మాదిరి నిర్మాణంలోని మెట్ల గుండా కిందికి దిగితే ఒక వెడల్పైన రాతి భాగం రెండు వైపులా పైకి లేచి లోపలి భాగం లోతుగా యోని మాదిరిగా ఉంటుంది. ఈ లోతైన యోని భాగంలో భూగర్భం నుంచీ వచ్చే ఊట ద్వారా నీరు నిండి ఉంటుంది. వేసవిలో జూన్ నెలలో వచ్చే ‘అంబూబాచి’ ఉత్సవ సమయంలో ‘ఖాసి’ గిరిజన తెగ వారు (మగ) మేకపోతులను శక్తికి బలి ఇస్తారు. ఆడ జంతువులను బలి ఇవ్వరు. వేలాది మంది భక్తులు, శాక్తేయులు (శక్తి ఆరాధకులు), అఘోరాలు ఇక్కడికి వచ్చి దేవిని పూజించి ఆమె ఆశీస్సులు పొందుతారు. దేవీ భాగవతంలో, దేవీ పురాణంలో, కాళికా పురాణంలో, యోగినీ తంత్రంలో, హేవజ్ర తంత్రంలో, తంత్ర చాముండామణిలో, కామరూప (గువాహటి) జిల్లాలోని శ్రీ కామాఖ్యాదేవి గురించిన సాహిత్య చర్చ (8వ శతాబ్దం), తాంత్రిక పూజా విధానంలో ముఖ్యమైనదిగా, యోగినీ తంత్రంలో, కాళికా పురాణంలో కామాఖ్యా దేవిని శాక్త తంత్రంగా అభివర్ణించారు. కాళికా పురాణంలో వర్ణించిన ఈ శక్తి స్వరూపిణి అన్ని కోరికలను తీర్చేది, మోక్ష ప్రదాయిని, శివుని ఇల్లాలైన సతీదేవియే శ్రీ కామాఖ్యాదేవి.
ఈ విద్యలో ముఖ్యమైనది నవత్రంత్రము ఈ తంత్రానికి  సాధ్యము కానిది ఏది లేదు అనే మాట అనేక గ్రంధములు తెలుపుతున్నాయి. ముఖ్యంగా  స్త్రీ ,పురుష వశీకరణము ,సభావశీకరణము ,రాజ్యవశీకరణము ,శత్రువశీకరము ,వృత్తివ్యాపారా వశీకరణము ,జంతు జనవశీకరణము ,రాక్షస ,బేతాళ ,పిశాచ వశీకరము ,దేవత వశీకరణము లవంటి విద్యలలో శుభఫలములు ఇచ్చును .
వరకాల మురళి మోహన్ సౌజన్యంతో 

Related Posts