YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వడివడిగా రాజధాని అడుగులు

వడివడిగా రాజధాని అడుగులు

వడివడిగా రాజధాని అడుగులు
విశాఖపట్టణం, మార్చి 20
రాజధాని  తరలిరపు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా, ఎన్నికల కోడ్ సడలింపు వంటి కారణాలతో పాలనా రాజధాని తరలింపు పై దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. దీనిలో భాగంగానే ఉద్యోగులనూ మానసికంగా సిద్ధం చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనికి అనుగుణంగానే సచివాలయ ఉద్యోగ సంఘం మే చివరి నాటికి విశాఖకు వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. తరలింపు ప్రక్రియను ఉగాదికి ప్రారంభించి మార్చి నెలాఖరులోగా పూర్తి చేయాలని ప్రభుత్వం తొలుత భావించింది. అయితే, పదో తరగతి పరీక్షలు ఈ నెల 31 నుంచి ఏప్రిల్‌ 15వ తేదీ వరకు జగరనుండటంతో ఆ తరువాతే తరలింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. సచివాలయ ఉద్యోగ సంఘం కార్యనిర్వాహక వర్గ సమావేశం సైతం మే నెలాఖరు నాటికి విశాఖకు వెళ్లేందుకు అభ్యంతరం లేదని ప్రకటించారు. అదే సమయంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారం. కావాల్సిన సౌకర్యాలపై ప్రభుత్వంతో చర్చిస్తామని చెప్పారు. ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులు పూర్తిగా ఎంతమంది అమరావతికి తరలివచ్చారు, వారి పిల్లల్లో ఎంతమంది ఇక్కడ చదువుకుంటున్నారు, ఉద్యోగుల్లో ఎంతమంది ఇక్కడ సొంత ఇళ్లు నిర్మించుకున్నారు, ఎంతమంది అద్దె ఇళ్లలో నివాసముంటున్నారు, ఎంతమంది ప్రభుత్వం సమకూర్చిన నివాసాల్లో ఉంటున్నారు అనే వివరాలనూ ఉద్యోగ సంఘ నేతలు సేకరిస్తున్నారు. విశాఖను పరిపాలనా రాజధానిగా నిర్ణయిస్తూ ప్రభుత్వం తీసుకున్న ప్రాథమిక నిర్ణయాలకు అనుగుణంగా త్వరలోనే ఉత్తర్వులు వస్తాయని, సచివాలయ ఉద్యోగులంతా విశాఖకు తరలి వెళ్లడానికి సిద్ధంగా ఉండాలని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వెంకట్రామిరెడ్డి  అన్నారు. విశాఖకు వెళ్లేందుకు సిబ్బందికి ఉన్న సమస్యలు పరిష్కరించాలని, సౌకర్యాలను ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని ఇప్పటికే ప్రభుత్వాన్ని కోరామని, ప్రభుత్వం దీనిపై సానుకూలత వ్యక్తం చేసిందని ఆయన తెలిపారు.ఉద్యోగుల పిల్లలకు స్కూల్‌ అడ్మిషన్లు, తాత్కాలిక ఉచిత వసతి ప్రభుత్వమే చూసుకోవాలని కోరామని, నూతన విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోపు ఉద్యోగుల తరలింపు ప్రక్రియను పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశామని, దీనికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని ఆయన తెలిపారు. మరోవైపు తరలింపు నేపథ్యంలో వివిధ శాఖల్లో కొత్త పోస్టుల నియామకంపై ఏర్పాటు చేసిన కమిటీ నేడు నివేదిక ఇవ్వనుంది. ఉద్యోగ సంఘాల సమాచారం మేరకు 85 పోస్టులు కొత్తగా ఏర్పడనున్నాయి. ఇందులో విభాగాధిపతుల పోస్టులు 40తోపాటు 25 సహాయ కార్యదర్శుల పోస్టులు, పది ఉప కార్యదర్శుల పోస్టులు, ఆరు సంయుక్త కార్యదర్శులు, నాలుగు అదనపు కార్యదర్శుల పోస్టులకు ఆమోదం లభించనుంది. కొత్తగా ఇళ్ల స్థలాలుపాత ఇళ్ల స్థలాలకు వడ్డీ లేని రుణాలు,పిల్లలకు విశాఖలో విద్యాసంస్థల్లో అడ్మిషన్లు, స్పౌస్‌ బదిలీ అవకాశాలు,తరలింపు అలవెన్స్‌,అమరావతిలో ఇల్లు, ఇళ్ల స్థలాలు తీసుకోనివారికి ప్రత్యేక రుణాలు,30 శాతం ఇంటి అద్దె అలవెన్స్‌,విశాఖకు వెళ్లేందుకు రవాణా సౌకర్యం కరవు భత్యం బకాయిల చెల్లింపు వంటి అంశాలు పరిష్కరించాలని కోరుతున్నారు.

Related Posts