YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం విదేశీయం

కరోనా దెబ్బకు కుదేలైన విమానయాన రంగం

కరోనా దెబ్బకు కుదేలైన విమానయాన రంగం

కరోనా దెబ్బకు కుదేలైన విమానయాన రంగం
న్యూఢిల్లీ, మార్చి 20
కరోనా వైరస్ ప్రభావంతో దేశీయ విమానయాన రంగం కుదేలయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కరోనా వైరస్ ప్రపంచవ్యాప్త అంటువ్యాధి కారణంగా విమానయాన రంగానికి గణనీయమైన నష్టాన్ని కలిగించింది.ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాల సరిహద్దులను పాక్షికంగా లేదా పూర్తిగా మూసివేశారు. దీంతో చాలా విమానయాన సంస్థలు తమ విమాన కార్యకలాపాలను తగ్గించాయి.అంతర్జాతీయ విమాన సంస్థల బాటలోనే భారతీయ విమాన సంస్థలు ఉద్యోగుల జీతాల్లో కోతలను ప్రకటించాయి. భారత్‌లో అతిపెద్ద విమాన సంస్థ ఇండిగో సిబ్బంది వేతనాల్లో కోత విధిస్తున్నట్టు ప్రకటించింది.కరోనావైరస్ కారణంగా భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా విమానయాన పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయింది. బుకింగ్ లేకపోవడంతో విమానయాన సంస్థలు ముందుకు సాగడం లేదు, ఉద్యోగులను తొలగించారు. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఎటిఎ) ప్రకారం, ప్రస్తుత పరిస్థితిలో ఎయిర్లైన్స్ కంపెనీలకు 200 బిలియన్ డాలర్ల  బెయిలౌట్ అవసరం. కరోనావైరస్ బారిన పడిన వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 2 లక్షలు దాటింది. 164 దేశాలలో సుమారు 8,500 మంది మరణించారు.  కోవిడ్19 వ్యాప్తితో భారత్‌లో పరిస్థితులు ప్రతికూలంగా మారడంతో అప్పు ల ఊబిలో కూరుకుపోయిన ఎయిర్ ఇండియా కూడా ఖర్చులను తగ్గించుకుంటోంది. ఎగ్జిక్యూటివ్ పైలట్లు, క్యాబిన్ క్రూ, అధికారులకు అలవెన్సులలో కోత పెట్టింది. దేశంలోని రెండు ప్రధాన విమానయాన సంస్థలు ఇండిగో, విస్తారా కార్యకలాపాలను నిలిపివేయాలని ఆలోచిస్తున్నాయి.ఇండిగో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఇఒ) రోనో దత్తా ఉద్యోగులందరికీ జీతాల కోత ప్రకటించారు. ఈమేరకు వారికి లేఖలను పంపారు. వ్యక్తిగతంగా తాను వేతనంలో 25 శాతం కోత విధించుకున్నట్టు తెలిపారు. కోరానా వైరస్ మహమ్మారితో ఆదాయంలో గణనీయమైన క్షీణత ఉందని, వైమానిక పరిశ్రమ ఉనికిని ప్రమాదంలో పడేసిందని ఇండిగో సిఇఒ అన్నారు. అందుకే వేతన కోతను ప్రకటించామన్నారు. ఇండిగో ఫ్లైట్స్ ఆపరేషన్స్ చీఫ్ ఆశిమ్ మిత్రా గురువారం ఉదయం పైలట్లకు పంపిన ఇమెయిల్‌లో విమానయాన రంగంలో ఆర్థిక వాతావరణం గణనీయంగా క్షీణించిందన్నారు. రాబోయే వారాల్లో కఠినమైన చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందని అన్నారు.ఆర్థిక వాతావరణం గణనీయంగా క్షీణించింది. ఏ విమానయాన సంస్థ ఈ క్షీణత నుండి బయటపడలేదు’ అని మిత్రా ఇమెయిల్‌లో పేర్కొన్నారు. ఆసియాలో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో తన ట్రాఫిక్‌ను 30 శాతం తగ్గించింది. అదే సమయంలో సింగపూర్ ఎయిర్లైన్స్ లిమిటెడ్ భారతీయ వెంచర్ అయిన విస్తారా, బోయింగ్ కంపెనీ 787 డ్రీమ్ లైనర్స్ మొదటి బ్యాచ్ పంపిణీని ఆలస్యం చేయడాన్ని పరిశీలిస్తోంది. యునైటెడ్ ఎయిర్‌లైన్స్ హోల్డింగ్స్, బ్రిటిష్ ఎయిర్‌వేస్ ఇటీవల తమ విమాన కార్యకలాపాలను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. అయితే భారతీయ కంపెనీలు ఆలస్యంగా ఈ నిర్ణయం తీసుకున్నాయి.కరోనా వైరస్ కారణంగా మాంద్యం ఎదుర్కొంటున్న విమానయాన రంగానికి ఉపశమనం కలిగించడానికి ప్రభుత్వం 1.6 బిలియన్ డాలర్ల (రూ. 12000 కోట్లు) ప్యాకేజీని ప్రకటించవచ్చని తెలుస్తోంది. విమానయాన రంగంపై పన్నును మినహాయించే ప్రతిపాదనను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోంది. విమానయాన సంస్థలు వడ్డీ లేకుండా తరువాత పన్ను చెల్లించే వెసులుబాటు కల్పించనున్నట్టు సమాచారం.

Related Posts