YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

 కాంగ్రెస్ కొంపముంచిన రాజ్యసభ ఎన్నికలు

 కాంగ్రెస్ కొంపముంచిన రాజ్యసభ ఎన్నికలు

 కాంగ్రెస్ కొంపముంచిన రాజ్యసభ ఎన్నికలు
న్యూఢిల్లీ, మార్చి 20
రాజ్యసభ ఎన్నికలు కాంగ్రెస్ కొంప ముంచేందుకే వచ్చినట్లుంది. రాజ్యసభలో బలం పెంచుకోవడం కోసమే భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ కు తెరతీసిందనే చెప్పాలి. గత కొన్నాళ్లుగా మౌనంగా ఉన్న బీజేపీ కర్ణాటక తరహాలో మిగిలిన రాష్ట్రాల్లో పాగా వేయడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. కర్ణాటకలో సక్సెస్ ఫార్ములానే ఇతర రాష్ట్రాల్లో అనుసరించడానికి సిద్ధమయింది. ఇందుకు మధ్యప్రదేశ్ ఉదాహరణ. రాజ్యసభ ఎన్నికలు లేకుంటే బీజేపీ ఇక్కడ వేలు పెట్టేది కాదు. ఇప్పుడు గుజరాత్ లోనూ కాంగ్రెస్ పార్టీ అదే ఇబ్బందులను ఎదుర్కొంటోంది. నిన్న మొన్నటి వరకూ కాంగ్రెస్ గుజరాత్ లో కాలు దువ్వింది. ఇరవై మంది ఎమ్మెల్యేలు వస్తే వారికి ముఖ్యమంత్రి పదవి ఇస్తామని కూడా కాంగ్రెస్ నేతలు పెద్ద ఆఫర్ ఇచ్చారు. కానీ బీజేపీ అక్కడ అధికారంలో ఉండటం, కేంద్రంలో పవర్ లో ఉండటంతో బీజేపీ ఎమ్మెల్యేలు వచ్చే అవకాశం లేదని తెలిసినా బీజేపీని రెచ్చగొట్టినట్లయింది.ఫలితంగా ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. సోమభాయ్ పటేల్, జేకే కాకడీయ, ప్రద్యుమ్న సిన్హా జడేజా, ప్రవీణ్ మరు, మంగళ్ గవట్ లు పార్టీకి రాజీనామా చేసిన వారిలో ఉన్నారు. వీరిని కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. అయితే రాజ్యసభ ఎన్నికల్లో వీరు కీలకం కానున్నారు. గుజరాత్ అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 180. అందులో బీజేపీకి 103 మంది సభ్యులుండగా కాంగ్రెస్ కు 73 మంది ఎమ్మెల్యేలున్నారు. ఐదుగురు సభ్యుల రాజీనామాతో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య 68కి పడిపోయింది.గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ ముగ్గురు సభ్యులను బరిలోకి దించింది. ఈ ముగ్గురిని గెలిపించుకునే లక్ష్యంగానే బీజేపీ కాంగ్రెస్ సభ్యుల చేత రాజీనామా చేయించింది. రాజ్యసభ ఎన్నికల కోసం కాంగ్రెస్ ముందుజాగ్రత్త చర్యలను చేపట్టింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను క్యాంపులకు తరలించింది. రాజ్యసభ ఎన్నికల కోసమే బీజేపీ మరోసారి అనేక రాష్ట్రాల్లో ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపింది. దానికి కాంగ్రెస్ పార్టీ కకావికలం అవుతుంది. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కువ స్థానాలను గెలుచుకుంటుందనే కారణంతోనే ఆ పార్టీ నేతలకు బీజేపీ గాలం వేస్తోంది.

Related Posts