YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

కరోనా నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు

కరోనా నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు

కరోనా నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు
హైద్రాబాద్, మార్చి 20
అతివేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం కొంత కఠినమైన నిర్ణయాలను సైతం తీసుకుంటుంది.ఇప్పటికే వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవల్సిన జాగ్రత్తలపై ప్రజలకు విస్త్రృత ప్రచారం కల్పిస్తున్న ప్రభుత్వం ఈ వైరస్ వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఇతర దేశాలు, దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి నగరానికి వచ్చిన 750 మందిని, అందులో 170 మంది విదేశీయులను గుర్తించింది. వీరంత నగరంలో బాగా అభివృద్ధి చెంది, ఎక్కువ విదేశాలకు రాకపోకలు సాగిస్తున్న ప్రాంతాల్లోనే ఉన్నట్లు సమాచారం. బల్దియాలోని ఒక్కో సర్కిల్‌లో ఐదు నుంచి పది మంది ఉండగా, మరికొన్ని సర్కిళ్లలో వందకు పైగా కూడా ఉన్నట్లు సమాచారం. వీరికి ఎలాంటి అనుమానిత లక్షణాలు లేకపోయినా, వారంతా 14 రోజుల పాటు ఇంట్లోనే ఉండాలని  కరోనా బృందాలు సూచించినట్లు సమాచారం. 14 రోజుల పాటు తరుచూ వీరి ఆరోగ్య పరిస్థితులను ఈ బృందాలు గమనించనున్నాయి. కరోనా నియంత్రణకు నాలుగు శాఖలతో వార్డుకొకటి చొప్పున ఏర్పాటు చేయాలని భావించిన బృందాలు మూడు శాఖల సిబ్బందికే పరిమితమయ్యాయి. రెవెన్యూ శాఖకు కరోనాకు సంబంధించి ఇతర విధులను అప్పగించటంతో ఈ మినహాయింపునిచ్చినట్లు సమాచారం. బల్దియా,పోలీసు, వైద్యారోగ్యశాఖకు చెందిన వారితోనే ఏర్పాటు చేసిన ఈ బృందాలు  రంగంలో దిగాయి. ఇప్పటికే పోలీసు శాఖ సేకరించిన వివరాల ప్రకారం ఇటీవలే విదేశాలు, ఇతర రాష్ట్రాలకు వెళ్లి వచ్చిన వారిని గుర్తించి, 14 రోజుల పాటు ఇంటి నుంచి బయటకు రాకుండా ఇంట్లోనే ఉండాలని సూచించినట్లు సమాచారం. ట్రావెల్ హిస్టరీ ఉన్న వారు సర్కారు ఆదేశాలను విస్మరించి బయట సంచరించినట్లు తమకు సమాచారం అందితే, వారిని నేరుగా క్యారెంటైన్‌కు తరలిస్తామని కూడా హెచ్చరించినట్లు సమాచారం. 14 రోజుల పాటు వీరి ఆరోగ్య పరిస్థితులను గమనించి, ఆ తర్వాత ఎవరికైనా కరోనా అనుమానిత లక్షణాలు కన్పిస్తే, వైరస్ తీవ్రతను బట్టి వారిని క్యారెంటైన్‌కు గానీ, ఆసుపత్రికి గాని తరలించాలని బృందాలు భావిస్తున్నాయి.కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఇప్పటి వరకు షాపింగ్ మాల్స్, బార్‌లు, పబ్‌లను మూసివేసిన బల్దియా ఇపుడు హాస్టళ్లపై దృష్టి సారించింది. బుధవారం కొన్ని హాస్టళ్లను మూసివేయించగా, మరికొన్నింటిని మూసివేయించేందుకు విద్యార్థులు అంగీకరించ లేదు. ఎస్‌ఆర్‌నగర్‌లోని మరికొన్ని వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్ల మూసివేతను కూడా బుధవారం అందులో ఉన్న వారు అడ్డుకున్నారు. ఉన్నట్టుండి హాస్టళ్లను మూసివేస్తే తమ పరిస్థితి ఏమిటీ? తాము పనిచేస్తున్న కంపెనీలు ఇంకా తమకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వలేదని, ఆ ఆప్షన్ ఇచ్చే వరకైనా హాస్టళ్లను కొనసాగించాలని కోరుతున్నారు.
ఇక ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కూడా హాస్టళ్లను మూసివేయించటం బల్దియా అధికారులకు తలనొప్పిగా మారింది.

Related Posts