YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

ప్రకృతి వైద్యానికి పెరుగుతున్న ఆదరణ

ప్రకృతి వైద్యానికి పెరుగుతున్న ఆదరణ

ప్రకృతి వైద్యానికి పెరుగుతున్న ఆదరణ
హైద్రాబాద్, మార్చి 20,
మానవునికి సంక్రమించే వివిధ రకాల వ్యాధులకు ప్రకృతి సిద్దంగా చికిత్సలు అందించే వైద్య విధానంపై ప్రజల్లో నానాటికి ఆసక్తి పెరుగుతుంది. ఇటీవల ప్రభుత్వం సంప్రదాయ, ఆయుర్వేద వైద్య విధానాలపై విస్తృత ప్రచారం నిర్వహించడంతో అల్లోపతి కంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ప్రకృతి వైద్యం ఎంతో మెరుగని భావిస్తున్నారు. దీంతో ఈ వైద్యవిధానాన్ని ఆశ్రయిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. అయితే అందుకు తగ్గట్టుగా ప్రభుత్వ రంగంలో ఆసుపత్రులు లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. రాష్టవ్య్రాప్తంగా అమీర్‌పేట ధరమ్‌కరం రోడ్డులో తెలంగాణ రాష్ట్ర యోగ అధ్యయన కేంద్రం ఆధ్వర్యంలో ప్రకృతిచికిత్సాలయం, కళాశాల కొనసాగుతున్నాయి. 1949వ సంవత్సరంలో డాక్టర్ బి. వెంకటరావు, విజయలక్ష్మి దంపతులు ఇక్కడ ఆసుపత్రిని స్థాపించారు. చాలా కాలం వారి ఆధీనంలోనే రోగులకు సహజసిద్ధమైన వైద్యం అందించారు. 1980వ దశకంలో ప్రభుత్వం ఈ వైద్యవిధానాన్ని అందుబాటులోనికి తేవాలని తన ఆధీనంలోకి తీసుకొంది. విశాలమైన స్థలంలో 184 పడకలతో యోగా, ప్రాణయామ, ధ్యాన, పంచకర్మ వంటి పద్ధతులతో రోగులకు చికిత్సలు అందిస్తున్నారు. వైద్యులు, ట్రీట్‌మెంట్ అసిస్టెంట్ల, యోగ శిక్షకుల కొరతతో వైద్య సేవలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రతీ సంవత్సరం ఇక్కడ విధులు నిర్వహిస్తున్న వారు రిటైర్ట్ అవుతున్నా ఆ స్థానాల్లో కొత్త వారిని నియమించక పోవడంతో సిబ్బందిపై అదనపు భారం పడుతోంది. 2006వ సంవత్సరంలో చివరి సారిగా ఇక్కడ నియామకాలు చేపట్టిన ప్రభుత్వం ఇప్పటి వరకు నియామకాల ప్రక్రియపై దృష్టి సారించలేదు. ఉమ్మడి రాష్ట్రంలో అధికారులు ఆసుపత్రి సేవలను విస్తరించడంతో పాటు వైద్యులు, సిబ్బందిపై పడుతున్న అదనపు భారాన్ని తగ్గించాలని పలుమార్లు విజ్ఞప్తులు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. ప్రస్తుతం నేచర్‌క్యూర్ ఆసుపత్రి షెడ్యూల్ -10లో ఉండటంతో ఆ వివాదం తేలే వరకు ఇక్కడ నియామకాలు చేపట్ట అవకాశాలు లేకుండా పోయింది. ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యం, ప్రస్తుతం ఈ వివాదం రోగుల పాలిట శాపంగా మారింది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి ఎలాంటి మందులు లేకుండా కేవలం ప్రకృతి సిద్ధంగా వైద్యం అందిస్తున్న ఆసుపత్రి విషయంలో ఇరు రాష్టల్రు సానుకూల నిర్ణయం తీసుకొని వైద్యసేవలను విస్తృత పరచాలని వైద్యులు కోరుతున్నారు.

Related Posts