YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు వాణిజ్యం ఆరోగ్యం తెలంగాణ

సిటీలో కనిపించని శానిటైజర్లు

సిటీలో కనిపించని శానిటైజర్లు

సిటీలో కనిపించని శానిటైజర్లు
సికింద్రాబాద్, మార్చి 20,
ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ వైరస్ అతివేగంగా వ్యాప్తి చెందుతుంటే, ఈ వైరస్ నివారణకు మహానగరంలో జీహెచ్‌ఎంసీ ఉత్తుత్తి ప్రచారం చేసి చేతులు దులిపేసుకుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నగరంలోని అన్ని పబ్లిక్ టాయిలెట్లతో పాటు ప్రతి వ్యాపార సంస్థలో ప్రజలకు హ్యండ్ శానిటైజర్‌లను అందుబాటులో ఉంచాలని కమిషనర్ లోకేశ్ కుమార్ ఆదేశించి, మూడురోజులు గడుస్తున్నా, ఎక్కడా కూడా శానిటైజర్లు కన్పించటం లేదు. పైగా జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలోని ఏడు అంతస్తుల్లో వేలాది మంది విధులు నిర్వహిస్తున్నా, ఇక్కడ కూడా వ్యాధి నివారణ చర్యలు తూతూమంత్రంగానే తయారయ్యాయి. ప్రతి అంతస్తులో ఉన్న టాయిలెట్లలో కూడా హ్యండ్ శానిటైజర్లు కన్పించటం లేదు. పైగా వేలాది మంది ఒకే చోట విధులు నిర్వహించటానికి తోడు ప్రతిరోజు సుమారు రెండు వేల మంది సందర్శకులు ఈ కార్యాలయానికి రాకపోకలు సాగిస్తుండటంతో ఎపుడు ఎవరి నుంచి వైరస్ తమకు సోకుతుందోననే భయంతో సిబ్బంది, అధికారులు వణికిపోతున్నారు. హ్యండ్ శానిటైజర్ సర్కిళ్లలో మెడికల్ ఆఫీసర్లు, డిప్యూటీ కమిషనర్లు, జోనల్ కమిషనర్ ఆఫీసుల్లో జోనల్ కమిషనర్, జోనల్ సిటీ ప్లానర్, ప్రధాన కార్యాలయంలో మేయర్, డిప్యూటీ మేయర్, కమిషనర్ ఛాంబర్, అదనపు కమిషనర్లు, పలు విభాగాధిపతుల టేబుళ్ల మీదకే పరిమితం కావటం గమనార్హం. వైరస్ కలిగిన వ్యక్తి ఒక మీటరు కంటే ఏమాత్రం తక్కువ దూరంలో తుమ్మినా, దగ్గినా అతివేగంగా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందని, దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండి, తరుచూ శానిటైజర్‌తో చేతులు మొచేయి వరకు శుభ్రంగా కడుక్కోవాలని ప్రకటనలు గుప్పించే అధికారులు తమ పక్కనే విధులు నిర్వహిస్తున్న కింది స్థాయి సిబ్బంది పట్టించుకోకకపోవటం వ్యాధి నివారణ పట్ల వారికున్న చిత్తశుద్ధికి నిదర్శనం.కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నగరంలోని రెస్టారెంట్లు, బార్‌లు, పబ్‌లు, షాపింగ్ మాల్స్, థియేటర్లు మూసివేయాలని సర్కారు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను ఉల్లంఘించి తెరిచిన 66 సంస్థలను సీజ్ చేసిన బల్దియా అధికారులు తమ కార్యాలయంలో వైరస్ నివారణపై దృష్టి సారించలేకపోతున్నారు. ప్రతి పబ్లిక్ టాయిలెట్‌లో శానిటైజర్ ఉంచాలని ఆదేశాలు జారీ చేసిన కమిషనర్.. ప్రధాన కార్యాలయంలో శానిటైజర్లను అందుబాటులో ఉంచటంలో విఫలమయ్యారు. బల్దియా ఆఫీసుల్లో వైరస్ నివారణ చర్యలు తీసుకోవటంపై దృష్టి సారించని కమిషనర్‌పై ఇప్పటికైనా కళ్లు తెరిచి, శానిటైజర్లను అందుబాటులో ఉంచుతారా? లేదంటే సిబ్బంది, ఆరోగ్య పరిరక్షణను గాలికొదిలేస్తారా? వేచి చూడాలి.

Related Posts