YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

ఆటో డ్రైవర్ దారుణ హత్య

ఆటో డ్రైవర్ దారుణ హత్య

ఆటో డ్రైవర్ దారుణ హత్య
అనంతపురం మార్చి 20
అనంతపురం జిల్లా  తాడిపత్రి పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. బాడుగకు రానందుకు ఒక ఆటో డ్రైవర్ ను దారుణంగా హత్య చేసిన సంఘటన పట్టణంలోని టైలర్స్ కాలనీలో చోటు చేసుకుంది. ఈ మేరకు గురువారం అర్ధరాత్రి పది గంటల సమయంలో దస్తగిరి ఆలియాస్ లడ్డు (26) ను ఆటో బాడుగకు రమ్మని గోగుల ఆది పిలిచాడు. అనంతరం అతడు ఇంటికి వెళ్లాలని తాను రాను అని తెలిపాడు. దాంతో వారు కచ్చితంగా రావాల్సిందేనని ఆది తగువు పెట్టుకున్నాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ సందర్భంగా పదునైన రాయిని తీసుకుని లడ్డూ తలపై ఆది బాదడంతో రక్తస్రావమై దస్తగిరి అక్కడికక్కడే మరణించాడు. అనంతరం  స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Related Posts