అత్యాచార నేరాలు చేసేవారికి ఉరి శిక్ష కనువిప్పు కావాలి
నిర్భయ తల్లి ఆశాదేవి
న్యూ డిల్లీ, మార్చి 20
దేశంలో మొట్టమొదటి సారి నలుగురిని ఒకే సారి ఉరి తీసి మహిళలపై అత్యాచారం చేసే వారికి సరైన శిక్ష విధిస్తామని దేశం చెప్పిందని నిర్భయ తల్లి ఆశాదేవి చెప్పారు. దేశం న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని అందుకే ఇన్ని సంవత్సరాలు పోరాటం చేశానని ఆమె చెప్పారు.నా కుమార్తె చనిపోయినా మళ్లీ రాదని తెలిసినా నేను న్యాయం కోసం పోరాడాను. చివరగా న్యాయం లభించింది అని ఆశాదేవి చెప్పారు. ఈ నలుగురి ఉరి తర్వాతనైనా దేశంలో మహిళల అత్యాచారాలలో మార్పు వస్తుందని ఆమె అన్నారు. పిల్లల తల్లిదండ్రులు తమ వారికి మంచి బుద్ధులు నేర్పాలని, లేకుంటే ఇలాంటి నేరాలు చేసి అత్యంత హీనంగా జీవితాన్ని ముగించాల్సి వస్తుందని ఆమె అన్నారు.