విశాఖలో కరోనా నమోదు
విశాఖపట్నం మార్చి 20
విశాఖలో కరోనా తొలి పాజిటివ్ కేస్ నమోదైంది. వైరస్ ను అరికట్టేందుకు సర్కారు పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచనలు చేసింది. ఈ క్రమంలో ఓ వృద్ధిడికి వైరస్ సోకినట్లు వైద్యులు నిర్దారించడంతో వైద్య శాఖ అప్రమత్తమైంది. కరోనా తొలి పాజిటివ్ కేసు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నగరంలోని అల్లిపురం ప్రాంతానికి చెందిన వృద్ధుడికి కరోనా సోకినట్లు నిర్ధారణ కావడంతో అతని నివాస ప్రాంతంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు, వాలంటీర్లతో 114 బృందాలు ఏర్పాటు చేశారు. మొత్తం 7,800 గృహాలను అధికారులు ప్రత్యేకంగా తనిఖీలను చేపట్టారు.స్ప్రేయింగ్ చేయడంతో పాటు వ్యాధి లక్షణాలు ఉన్నవారిని గుర్తించేలా తగిన చర్యలు చేపడుతున్నారు.