దేశవ్యాప్తంగా 2014-18 కాలంలో 1.75 లక్షల అత్యాచార కేసులు
న్యూఢిల్లీ, మార్చి 20
దేశవ్యాప్తంగా 2014-18 కాలంలో 1.75 లక్షల అత్యాచార కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని కేంద్రహోం మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ)వెల్లడించింది. ఎన్‌సీఆర్‌బీ డాటా ప్రకారం..ఐదేళ్ల కాలంలో మొత్తం 1,75,695 కేసులు నమోదయ్యాయి. వీటిలో 2014లో 36,739 కేసులు నమోదవగా, 2015లో 34,094 కేసులు నమోదయ్యాయి.2016లో అత్యధికంగా 38,739 అత్యాచారకేసులు నమోదయ్యాయి. 2017లో 32,559 కేసులు, 2018లో 33,356 కేసులు రికార్డయ్యాయి. మధ్యప్రదేశ్ 25,259 కేసులతో అత్యధిక అత్యాచార కేసులు నమోదైన రాష్ట్రంగా నిలిచింది. ఆ తరువాతి స్థానాల్లో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర నిలిచాయి.