జువైనల్ పర్యవేక్షణలో ఐదో నిందితుడు
న్యూఢిల్లీ, మార్చి 20
నిర్భయ కేసులో నలుగురు దోషులకు తీహార్ జైల్లో ఉరి శిక్ష అమలు చేశారు. దేశవ్యాప్తంగా మరణ శిక్ష అమలుపై హర్షం వ్యక్తం చేశారు. తీహార్ జైలు బయటు కూడా సంబరాలు జరుపుకున్నారు. ఇదాంతా బానే ఉంది.. ఈ కేసులో మొత్తం ఆరుగురుపై ఆరోపణలు రాగా.. రామ్‌సింగ్ అనే దోషి జైల్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. మరో నిందితుడు మైనర్ కావడంతో జువైనల్ హోమ్ నుంచి విడుదలయ్యాడు. ఇప్పుడు నలుగురిని ఉరి తీయడంతో అతడు ఎక్కడున్నాడనే అందరూ ఆసక్తిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అతడి వివరాలపై ఆరా తీస్తున్నారు.హోమ్ నుంచి విడుదలైన తర్వాత అతడు తన పేరును మార్చుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించినట్లు.. అతడి బాగోగులు చూస్తున్న ఎన్జీవో సంస్థ చెబుతోంది. అతడ్ని దేశ రాజధాని చాలా దూరంగా పంపించేశామని.. అప్పుడే ప్రజలు అతడ్ని గుర్తించరు, వివరాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేయరని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అతడు ఓ చోట వంటవాడిగా పనిచేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అతడి యజమానికి కూడా అసలు పేరు.. గత చరిత్ర తెలియదంటున్నారు.ముందు అతడ్ని ఒక చోట నుంచి మరో చోటికి పంపించామని.. అందుకే అతడి గురించి ఎవరికీ తెలియలేదంటున్నారు ఎన్జీవో సంస్థ ప్రతినిధి. అతడు ప్రస్తుతం జువైనల్ జస్టిస్ బోర్డ్ పర్యవేక్షణలో ఉన్నానడి.. మీడియా కూడా అతడి వివరాలను బహిర్గతం చేయకపోవడమే మంచిది అంటున్నారు. ఈ మైనర్ అంత క్రూరమైన వ్యక్తి కాదని తేలిందని.. కేవలం ఈ కేసులో దోషి అయిన రామ్‌సింగ్ (ఆత్మహత్య చేసుకున్నాడు)కు సహాయకుడిగా ఉన్నాడని గుర్తు చేశారు.ఈ మైనర్ రామ్‌సింగ్ తనకు ఇవ్వాల్సిన రూ.8వేల తీసుకోవడం కోసం వెళ్లాడట. అదే సమయంలో బస్సులో ఈ ఘటన జరిగిందని.. ఇలా ఈ కేసులో బుక్కైపోయాడట. ఉత్తరప్రదేశ్‌కు చెందిన మైనర్ ఉపాధి కోసం ఢిల్లీ వచ్చాడు. రామ్‌సింగ్ దగ్గర సహాయకుడిగా చేరాడు.. జీతానికి సంబంధించి రూ.8వేలు ఉండటంతో ఆ డబ్బు తీసుకోవడానికి వెళ్లాడు.. అదే సమయంలో నిర్భయ ఘటన జరిగింది.