YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

వదినపై కామం.. అన్న హత్య

వదినపై కామం.. అన్న హత్య

వదినపై కామం.. అన్న హత్య
గుంటూరు, మార్చి 20
కామంతో కళ్లు మూసుకుపోయి తల్లి లాంటి వదినపై కన్నేశాడో ప్రబుద్ధుడు. అన్న ముందే ఆమె చేయి పట్టుకుని లాగి అసభ్యంగా ప్రవర్తించాడు. తన కళ్లముందే భార్య చేయి పట్టుకోవడంతో ఆగ్రహానికి గురైన అన్న.. తమ్ముడిని కొట్టి తీవ్రంగా మందలించాడు. దీంతో కక్ష గట్టిన తమ్ముడు.. అన్నని అంతమొందించాలని రగిలిపోయాడు. తండ్రితో కలసి పథకం పన్నాడు. అన్న కదలికలను క్షుణ్ణంగా తెలుసుకుని అదను చూసి కిరాతకంగా హత్య చేశాడు. ఈ దారుణ ఘటన గుంటూరు నగరంలో కలకలం రేపింది.గుంటూరులోని తుఫాన్‌ నగర్ రెండో లైన్‌కి చెందిన ఆటో డ్రైవర్ షేక్ నాగకుమార్ దారుణ హత్యకు గురయ్యాడు. పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని తురకపాలెం రోడ్డు భాగ్యనగర్ ఒకటో లైన్ జామాయిల్ తోట వద్ద నాగకుమార్‌ని రౌడీషీటర్లైన తండ్రీకొడుకులు అంగలకుర్తి మంగరాజు, పుల్లయ్య రోకలిబండతో దారుణంగా తలపై కొట్టి చంపేశారు. హతుడు నాగకుమార్, నిందితులు సమీప బంధువులే కావడం గమనార్హం. మంగరాజు భార్య మరియమ్మ, నాగకుమార్ తల్లి నాగమణి సొంత అక్కాచెల్లెళ్లు. పుల్లయ్య హతుడు నాగకుమార్‌కి తమ్ముడువారం రోజుల కిందట నాగకుమార్ భార్య రాణితో పుల్లయ్య అసభ్యంగా ప్రవర్తించాడు. తనముందే భార్య చేయి పట్టుకుని లాగడంతో నాగకుమార్ ఆగ్రహంతో పుల్లయ్యపై చేయి చేసుకున్నాడు. మరోసారి ఇలా జరిగితే బాగుండదంటూ తీవ్రంగా హెచ్చరించాడు. అది మనసులో పెట్టుకున్న పుల్లయ్య.. ఎలాగైనా నాగకుమార్‌ని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. తన తండ్రి, మరో రౌడీషీటర్ మంగరాజుతో కలసి అన్న హత్యకు ప్లాన్ చేశాడు. అందులో భాగంగా నాగకుమార్‌ రోజువారీ కార్యక్రమాలపై రెక్కీ నిర్వహించారు. ఎక్కడ ఒంటరిగా దొరుకుతాడని ఆరా తీశారు.పట్టాభిపురం పరిధిలోని తుఫాన్ నగర్ రెండో లైన్‌లో నివాసం ఉంటున్న నాగకుమార్.. ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇటీవలె కొత్త ఆటో కొనుక్కున్నాడు. ఈస్టర్ సందర్భంగా మాల కూడా ధరించినట్లు తెలుస్తోంది. అయితే మధ్యాహ్నం వేళ భోజనం అయిన తరువాత భాగ్యనగర్ మొదటి లైన్ జామాయిల్ తోట వద్ద ఉన్న ఖాళీ స్థలం వద్దకు వచ్చి చెట్ట కింద సేదతీరడం నాగకుమార్‌కి అలవాటు. కర్రాబిళ్ల ఆటపై ఆసక్తి ఉండడంతో ఆ ఖాళీ స్థలంలో ఆట ఆడేవారిని చూస్తూ ఉండేవాడు. ఇది గమనించిన తమ్ముడు పుల్లయ్య.. అక్కడే అన్నని హత్య చేయాలని ప్లాన్ చేశాడు.నాగకుమార్ రాకముందే మంగరాజు, పుల్లయ్య అక్కడికి చేరుకుని ఫుల్లుగా మద్యం తాగారు. కాసేపటికి నాగకుమార్ ఆటోలో అక్కడికి చేరుకున్నాడు. అదను చూసి తండ్రీకొడుకులు వెనక నుంచి ఒక్కసారిగా రోకలిబండతో నాగకుమార్ తలపై బలంగా కొట్టారు. దెబ్బ గట్టిగా తగలడంతో నాగకుమార్ అక్కడే కుప్పకూలిపోయాడు. విషయం తెలుసుకున్న అతని భార్య రాణి పరుగున సంఘటన స్థలానికి వచ్చింది. రక్తపు మడుగులో పడి ఉన్న భర్తను చూసి షాక్‌కి గురైంది. స్థానికుల సాయంతో అదే ఆటోలో భర్తను ఎక్కించుకుని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే అతను మరణించినట్లు ధ్రువీకరించారు.తన భర్తను దారుణంగా కొట్టి హత్య చేశారని భార్య రాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టాభిపురం పోలీసులు విచారణ చేపట్టారు. అయితే హత్య జరిగేందుకు కొద్ది సమయం ముందు పుల్లయ్య తుఫాన్ నగర్‌లోని నాగకుమార్ ఇంటి ముందు వెళ్తూ అతని భార్య రాణి వైపు కోపంగా చూశాడని.. కానీ ఇంతటి ఘాతుకానికి పాల్పడతాడని ఊహించలేదని బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. నిందితులు మంగరాజు, పుల్లయ్యలపై గతంలోనే రౌడీషీట్లు ఉన్నాయని.. పుల్లయ్య, అతని తల్లి మరియమ్మ ఆ ప్రాంతంలో బెదిరింపు వసూళ్లకు పాల్పడేవారన్న ఆరోపణలున్నాయి. అంత జరుగుతున్నా పోలీసులు వారిని కట్టడి చేయడంలో విఫలమయ్యారన్న వాదనలు వినిపిస్తున్నాయి. సంఘ విద్రోహక శక్తులుగా మారిన రౌడీషీటర్లను అదుపు చేయకపోవడం వల్లే మరో దారుణ హత్య చోటుచేసుకుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Related Posts