YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రశంసలు...!!!

రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రశంసలు...!!!

2017-18 ఉపాధి హామీ పథకం అమలులో సుపరిపాలన సూచికలను కచ్చితంగా అమలు చేసిన ఏపీ 7 రిజిస్టర్లతో పాటు పనులవారీ దస్త్రాలు నిర్వహించిన ఆంధ్రప్రదేశ్‌. పౌర సమాచార బోర్డుల ఏర్పాటు, 42 లక్షల జాబ్‌కార్డుల జారీలో ఉత్తమ పనితీరు ప్రశంసిస్తూ లేఖ రాసిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శి అపరాజిత సారంగి..

    కేంద్ర ప్రభుత్వ వేతన నిధుల్లో జాప్యం జరిగినా రాష్ట్ర ప్రభుత్వం చొరవచూపి పేదలకు ఇబ్బందిలేకుండా చూసిందని ప్రశంస.2017-18 ఆర్థిక సంవత్సరం రూ.180 కోట్లు చెల్లించి ఉపాధి కూలీలను ఇబ్బందిలేకుండా చేసిన రాష్ట్ర ప్రభుత్వం.2017-18లో 21.53 కోట్ల పనిదినాలను వేతనదారులకు కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ ద్వారా రూ.6149.38 కోట్లు ఖర్చు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.మొత్తం 6,33,080 కుటుంబాలకు వందరోజుల పని కల్పించిన ప్రభుత్వం.

పథకం ప్రారంభం నుంచి ఒక ఆర్థిక సంవత్సరంలో పెద్దమొత్తంలో నిధులు ఖర్చుచేయడం ఇదే ప్రప్రథమని ప్రశంస.2017-18 ఆర్థిక సంవత్సరంలో జాతీయ స్థాయిలో నాలుగు సూచికల్లో ప్రథమ స్థానంమరో నాలుగు సూచికల్లో ద్వితీయ స్థానం.గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులకు అభినందనలు తెలిపిన మంత్రి నారా లోకేష్ .ఈ ఆర్థిక సంవత్సరంలోనూ ఉత్తమ పనితీరు కల్పించాలని ఆకాంక్షించిన లోకేష్

Related Posts