విశ్వ & సర్వ మానవాళి శ్రేయస్సును కోరే ఉపనిషత్తులలోని మహిమాన్వితమైనవి ఈ శాంతి మంత్రములు*
ఓంశ్రీమాత్రే నమః
అద్వైత చైతన్య జాగృతి
*శాంతి మంత్రములు ఇవి మన ఉపనిషత్తులలో చెప్పబడినవి. వీటిని నేటి కాలంలో పూజలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు పూర్తి అయిన తరువాత చదువుతున్నారు. కానీ పూర్వ కాలంలో గురుకుల విద్యాభ్యాసం ఉన్న రోజుల్లో ప్రతిరోజూ గురు శిష్యులు కలిసి చదివేవారు. వేదవిదులైన పండితుల ద్వారా పఠించబడే ఈ శాంతి మంత్రములు విశ్వశ్రేయస్సును,సర్వ మానవాళి శ్రేయస్సును కోరి ప్రపంచదేశాల శ్రేయస్సును కోరి సమాజంలో, దేశంలో శాంతిని, సౌభ్రాతృత్వాన్ని పెంచడానికి దోహదం చేస్తాయి ఈ దివ్యమైనశాంతి మంత్రాలు.సర్వ జనులు ఈ మంత్రాలను చదువుకుంటే అందరికి మేలు చేకూరుతుంది.*
*1. ఓం సహనావవతు, సహనౌ భునక్తు, సహవీర్యం కరవావహై*
*తేజస్వినా వధీతమస్తు మావిద్విషావహై*
*ఓం శాంతి: శాంతి: శాంతి:*
*తాత్పర్యం:-*
*సర్వ జీవులు రక్షింప బడు గాక... సర్వ జీవులు పోషింప బడు గాక... అందరూ కలిసి గొప్ప శక్తి తో కూడి పని చేయాలి (సమాజ ఉద్ధరణ కోసం)... మన మేధస్సు వృద్ది చెందు గాక... మన మధ్య విద్వేషాలు రాకుండు గాక... ఆత్మా (వ్యక్తిగత) శాంతి, దైవిక శాంతి, ప్రాకృతిక శాంతి కలుగు గాక...*
*2. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు..*
*ఓం సర్వేషాం శాంతిర్భవతు..*
*ఓం సర్వేషాం పూర్ణం భవతు..*
*ఓం సర్వేషాం మంగళం భవతు..*
*తాత్పర్యం:-*
*సర్వులకు సుఖము, సంతోషము కలుగుగాక..*
*సర్వులకు శాంతి కలుగు గాక..*
*సర్వులకు పూర్ణ స్థితి కలుగుగాక.. సర్వులకు శుభము కలుగుగాక..*
*3. ఓం సర్వేత్ర సుఖిన: సంతు, సర్వే సంతు నిరామయా,*
*సర్వే భద్రాణి పశ్యన్తు మాకశ్చి: దుఃఖ:మాప్నుయాత్...*
*తాత్పర్యం:-*
*సర్వులు సుఖ సంతోషాలతో వర్ధిల్లు గాక..*
*సర్వులు ఏ బాధలు లేక ఆరోగ్యంతో ఉండు గాక..*
*అందరికీ ఉన్నతి కలుగు గాక..*
*ఎవరికీ బాధలు లేకుండు గాక..*
*4. కాలే వర్షతు పర్జన్య: పృథివీ సస్య శాలినీ.. దేశోయం క్షోభ రహితో, బ్రహ్మణా సంతు నిర్భయ:*
*తాత్పర్యం:-*
*మేఘాలు సకాలములో కురియు గాక. భూమి సస్యశ్యామలమై పండు గాక. దేశము లో ఏ బాధలు లేకుండు గాక. బ్రాహ్మణులూ, వారి సంతతి నిర్భయులై సంచరించెదరు గాక.*
*5. ఓం అసతోమా సద్గమయ,*
*తమసోమా జ్యోతిర్గమయ,*
*మృత్యోర్మా అమృతంగమయ..*
*ఓం శాంతి: శాంతి: శాంతి:*
*తాత్పర్యం:-*
*సర్వవ్యాపి, నిరాకారుడైన భగవంతుడా, మమ్ములను అసత్యము (మిధ్య) నుంచి సత్యమునకు గొనిపొమ్ము. (అజ్ఞానం అనే) అంధకారము నుండి (జ్ఞానస్వరూపమైన) వెలుగునకు దారి చూపుము. మృత్యు భయము నుండి శాశ్వతమైన అమృతత్వము దిశగా మమ్ము నడిపించుము.*
వరకాల మురళి మోహన్ సౌజన్యంతో