ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మూడు ఇండోనేషియా బృందాల పర్యటన
-ప్రార్థన మందిరాల్లో మత ప్రచారాలు
కరీంనగర్,మార్చి 21
ఇండేనేషియా దేశానికి చెందిన పదుల సంఖ్యలో మత ప్రచారకులు మూడు బృందాలుగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పర్యటించారు. ఫిబ్రవరి 8వ తేదీ నుంచి మూడు దఫాలుగా ఇండోనేషియాకు చెందిన మతప్రచారకులు ఉమ్మడి జిల్లాలోని పలు మసీద్‌లలో మత ప్రచారాన్ని నిర్వహించారని కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించి అప్రమత్తం చేశారు. ఈ సందర్భంలోనే ఈ నెల 14న కరీంనగర్ వచ్చిన 12 మంది బృందంలో ఎనిమిది మందికి కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో కలకలం రేగింది. విదేశీయులు జిల్లాలో పర్యటిస్తున్నప్పటికీ స్థానిక పోలీసులకు సరైన సమాచారం ఉండడం లేదని తెలుస్తోంది. సాధారణంగా విదేశీయులు ఎవరైనా జిల్లాకు వచ్చిన సందర్భంలో స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతోపాటు వారు ఏ కార్యక్రమాల్లో పాల్గొంటారు? ఎన్ని రోజులు ఉంటారు? పాస్‌పోర్ట్ వివరాలు, ఆశ్రయం ఇస్తున్న స్థానికుల వివరాలతో ‘ఫాం సీ’ అందించాల్సి ఉంటుంది. కాగా చాలా సందర్భాల్లో ఇటువంటి వివరాలు స్థానిక పోలీసులకు అందించడం లేదని తెలుస్తోంది. 10 మంది మతప్రచారకుల మొదటి బృందం ఫిబ్రవరి 8న తేదీన ఢిల్లీ నుంచి రైలు ద్వారా రామగుండంకు చేరుకుని అక్కడి నుంచి నేరుగా సిరిసిల్లకు వెళ్లినట్లు తెలిసింది. అక్కడ రెండు రోజుల ప్రచారం అనంతరం వేములవాడ, కరీంనగర్, పెద్దపల్లిలలోని మసీదులలో సమావేశాలు నిర్వహించారు. అనంతరం తిరిగి 18న రామగుండంకు చేరుకుని రైలు ద్వారా ఢిల్లీకి వెళ్ళిపోయారు. వీరు ఈనెల11 నుంచి 13వ తేదీ వరకు (బుధ, గురు, శుక్ర) రేకుర్తి శివారులోని సాలేహ్‌నగర్ ఈద్గా వెనుకాల గల మసీదు, బొమ్మకల్ గ్రామ పరిధిలోని ఉన్నట్లు అనుమానం.