వారానికి ఇద్దరు అమ్మాయిల మిస్సింగ్...
కనిపించని జాడ
హైద్రాబాద్, మార్చి 21
బాలానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో అదృశ్య మైన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. బాలానగర్ పారిశ్రామిక పరిసర ప్రాంతాలైన రంగారెడ్డి నగర్, గుడెన్ మెంట్, ఇందిరానగర్, గౌతమ్‌నగర్, రాజు కా లనీ, వినాయక్ నగర్ తదితర ప్రాంతాల నుంచి వారంలో రెండు నుంచి మూడు మి స్సింగ్ కేసులైనా నమోద వుతున్నాయి. కనిపిం చకుండా పోయిన వారిలో ఎక్కువగా మైనర్‌లు, యువతులు, వివాహితులు, వృద్ధులే అధికం. పిల్లలున్న మహిళలు సైతం ఇంటి నుంచి వెళ్లిపోవడంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొం టున్నది. బాలానగర్ పారిశ్రామిక వాడలో వివిధ రాష్ట్రాల నుంచి జీవనోపాధి కోసం వలసలు వచ్చిన విభిన్న మతాలు, కులాలు, ఆశాలకు చెందిన వారు బాలానగర్, ఫతేనగర్, ప్రశాంత్ నగర్, గాంధీనగర్, రంగారెడ్డి నగర్, శ్రీశ్రీ నగర్ తదితర ప్రాంతాల్లో ఉన్న చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లో కార్మికులుగా పనిచేస్తూ సమీప ప్రాంతాల్లో నివాసముంటూ ఆయా కుటుం బాలు జీవనోపాధి పొందు తున్నారు. పూట గడవడం కోసం ఇంటిల్లిపాది 16 నుంచి 21 ఏండ్ల వయసున్న యువతీ యువకులు ఆయా పరిశ్రమల్లో పని చేస్తు న్నారు. పండుగలు, శుభకార్యాలయాలకు సొంత ఊర్లకు వెళ్ళినవారు కొందరు మహి ళలు, వృద్ధులు అదృశ్యం అవు తున్నారు. మరి కొందరు ఇంటి నుంచి వెళ్లి తిరిగి రావడం లేదు. ఇంకొందరు యువతీ యువకులు పని చేసే ఆయా పరిశ్రమల్లో ఆకర్ష ణకులోనై ప్రేమ వ్యామోహంతో తమ తల్లిదం డ్రులకు తెలిస్తే తమను ఎక్కడ విడదీస్తారోనన్న భయంతో కుటుంబ సభ్యులకు చెప్పకుండా ఇల్లు వదిలి వెళ్లిపోతున్నారు. వీరిలో మైనర్లు, యువతులు, వివాహితులు సైతం ఉండడం గమనార్హం. కొన్ని కుటుం బాల్లో చిన్నచిన్న మనస్పర్ధలతో గొడవలు పడి ఇంట్లో ఎవరూ లేని సమ యంలో వెళ్లిపోతున్నారు. మరికొందరి కుటుం బాల్లో అత్తా కోడళ్ల మధ్య పనుల్లో, ప్రవర్తనలో ఘర్షణలు పడి ఎవరికీ చెప్పకుండా గడప దాటుతున్నారు. మరో కోణంలో వివాహితులైన మహిళలు, పురుషులు వివాహేతర సంబంధాలు ఏర్ప రుచుకుని డబ్బు కోసం కొందరు, వ్యామోహంతో మరికొందరు ఇంటిని వదిలి అడ్రస్ లేకుండా పోతున్నారు. అంతే కాకుండా సమాజంలో అనేకరకాల వేధింపులు లేక నెలలో వేళ్ల మీద లెక్కపెట్టుకుని సంఖ్య అదృశ్య కేసులు నమోదవుతున్నాయి. వారి ఆచూకీని గుర్తించడంలో పోలీసులకు తలనొప్పిగా మారింది.కుటుంబంలో ఎవరైనా ఇంటా, బయటా కనిపించకుండా పోతే ఫిర్యాదు దారులు కచ్చి తమైన సమాచారం ఇచ్చినపుడే దర్యాప్తు సరిగా చేయవచ్చు. పరువు కోసమో, వ్యక్తులకు భయ పడో తప్పుడు సమాచారమిస్తే దర్యాప్తు దారి తప్పుతుంది. తప్పి పోయిన వ్యక్తుల వివరాలను పోలీసుల వద్ద దాచకుండా ఫిర్యా దు పత్రంలో వివరంగా ఉండాలి. దర్యాప్తు ముందుకు సాగా లంటే కుటుంబ సభ్యులు సహకరించాలి. ముఖ్యంగా పిల్లలు, మహిళలు, వృద్ధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా సమస్య ఉంటే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలి.