YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు వాణిజ్యం తెలంగాణ

మద్యానికి అడ్డాలుగా మారిన రాంనగర్

మద్యానికి అడ్డాలుగా మారిన రాంనగర్

మద్యానికి అడ్డాలుగా మారిన రాంనగర్
హైద్రాబాద్, మార్చి 21
రాంనగర్‌ ప్రధాన రోడ్డు మద్యం దుకాణాలకు నిలయంగా మారింది. సాయంత్రం వేళల్లో చౌరస్తా నుంచి చేపల మార్కెట్‌, నల్లకుంటవైపు వెళ్లాలంటే వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీనికి కారణం రోడ్లపైనే మద్యం షాపులు ఉండటం కారణంగా అక్కడికి వచ్చేవారు రోడ్లపై వాహనాలు నిలిపివేసి మద్యం తాగుతున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో సాయంత్ర అయితే చాలు రద్దీగా ఉంటుంది. ఈ సమయంలో మహిళలు అటుగా వెళ్లాలంటే భయపడుతున్నారు.ఆబ్కారీ అధికారులు మాత్రం మద్యంషాపులకు అనుమతులిచ్చి చేతులు దులుపుకున్నారు. కానీ ఇక్కడ జరిగే ట్రాఫిక్‌ జామ్‌ వంటి సమస్యలకు ఎటువంటి పరిష్కారం చూపడం లేదు.ఇక్కడ రద్దీ అధికంగా ఉండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. తక్షణమే అధికారులు స్పందించి ఈసమస్యలను పరిష్కరించాలని స్థానికులు వాపోతున్నారు.మద్యం దుకాణాలు పాటించాల్సిన నిబంధనలు పాటించకుండా వాటికి తూట్లు పొడుస్తున్నారు. మైనర్‌ పిల్లలకు మద్యం అమ్మకాలు చేయరాదనే నిబంధనలు మీరి మరీ విక్రయాలు చేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మద్యం విక్రయాలను పెంచుకోవడానికి మద్యం వ్యాపారులు తమ దుకాణాల పక్కన పర్మిట్‌ రూంలను ఏర్పాటు చేసుకున్నారు. దీంట్లో అన్ని తినుబండారాలను విక్రయిస్తూ బార్లను తలపించేలా కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. రాంనగర్‌ చౌరస్తా నుంచి నల్లకుంట చేపల మార్కెట్‌కు వెళ్లే దారుల్లో ఇరువైపులా వ్యాపార సముదాయాలు ఉండడంతో రద్దీ ఎక్కువగా ఉంటుంది. దానికి తోడు మద్యం కోసం వచ్చే వారి వాహనాలు రోడ్లపైనే గంటల తరబడి పార్కింగ్‌ చేసి ఉండడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రాంనగర్‌ చౌరస్తా, పార్సిగుట్టకు వెళ్లేదారిలో ఈసమస్య ఎక్కువగా ఉంటుంది.ప్రభుత్వం ప్రత్యేక సందర్భాలలో వైన్స్‌ బంద్‌ చేసినప్పుడు బ్లాక్‌ లో ఎక్కడ పడితే అక్కడ రాంనగర్‌లో విరివిరిగా మద్యం అమ్మకాలు జరుగుతాయి. స్థానికులు వీరిపై ఎక్సైజ్‌ అధికారులకు అనేకమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని బస్తీల మహిళలు కోరుతున్నారు.

Related Posts