ఎమ్మెల్యే దంపతుల స్వీయ నియంత్రణ
ఆసిఫాబాద్, మార్చి 21,
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప దంపతులు , ఇటీవల అమెరికా పర్యటించి వచ్చారు. వారి స్వీయ నియంత్రణ కోసం జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేశారు . కోవిడ్-19 నియంత్రణపై కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఇతర దేశాలకు వెళ్లి వచ్చిన వారు 14 రోజుల పాటు స్వీయ నియంత్రణ చేపట్టలని అధికారులు సూచించారు . అమెరికా పర్యటన నుంచి కోనప్ప దంపతులు ఈనెల 18న కాగజ్నగర్ కు వచ్చారు. అనంతరం ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు . కరోనా ముందస్తు జాగ్రత్తల నేపథ్యంలో కోనప్ప దంపతులు 14 రోజుల పాటు స్వీయనియంత్రణలో భాగంగా ఇంట్లోనే ఉండాలని సీఎంవో కార్యాలయం సూచించింది . వీరితో పాటు వీరి కుటుంబ సభ్యులకు , ఎమ్మెల్యేను కలిసిన ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని ఆదేశించారు .