YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మేడారం జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

మేడారం జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు జరగబోయే మేడారం జాతరకు సర్వం సిద్ధమైంది. ఈ జాతరకు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు రంగారెడ్డి ఆర్‌ఎం యాదగిరి వెల్లడించారు. ఈ నెల 27 నుంచి ఫిబ్రవరి 3 వరకు నగరంలోని పలు ప్రాంతాల నుంచి 690 ప్రత్యేక బస్సులు నడుపుతామని తెలిపారు. ఎంజీబీఎస్ నుంచి 392, జేబీఎస్ నుంచి 205, కేపీహెచ్‌బీ నుంచి 49, జగద్గిరిగుట్ట నుంచి 33 ప్రత్యేక బస్సులు నడవనున్నాయి.

Related Posts