. ప్రజల ఆరోగ్యంతో వైసిపి చెలగాటం
మంగళగిరి, మార్చి 21
కరోనా మహమ్మారి రోజురోజుకూ తీవ్రతరం అవుతోంది. స్వల్పకాలంలో 177దేశాలకు కరోనా విస్తరించింది. 10వేల మందిపైగా కరోనాతో మృతి చెందారు. కరోనా తీవ్రతపై ప్రజలను అప్రమత్తం చేయాలి. ముందస్తు జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన పెంచాలి. ప్రధాని మోది ‘‘జనతా కర్ఫ్యూ’’కు పిలుపిచ్చారు. ఆదివారం జనతా కర్ఫ్యూ అందరూ పాటించాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం అయన టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి ప్రజా ప్రతినిధులు, వివిధ జిల్లాల నేతలు పాల్గోన్నారు. 10 ఏళ్ల పిల్లలు, 65 ఏళ్ల వృద్ధుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద చూపించాలి. ఈ విషయంలో కరపత్రాలు, బుక్ లెట్స్ పంపిణి చేయాలి. స్థానిక ఎన్నికల్లో వైసిపి అక్రమాలపై పోరాడాలి. ప్రతిచోటా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లు సేకరించాలి. వైసిపి బెదిరింపులపై ఎవిడెన్స్ లు సేకరించాలి. బలవంతపు ఏకగ్రీవాలపై సాక్ష్యాధారాలు సేకరించాలి. అన్ని సాక్ష్యాధారాలను ఆర్వోలకు, ఈసికి పంపించాలి. నామినేషన్లు వేయలేక పోయినవాళ్లు అనేకమంది. స్కూటినిలో బలవంతపు ఉపసంహరణలు అనేకం అభ్యర్ధులను బెదిరించి అనేకం ఏకగ్రీవం చేశారని ఆరోపించారు. 2 % ఏకగ్రీవాలు 24%కావడమే ప్రత్యక్ష రుజువు. వేలాదిమందిపై తప్పుడు కేసులు బనాయించారు. ఈసి రాసిన లేఖలో ఈ అక్రమాలన్నీ పేర్కొన్నారు. వైసిపి దాడులు, దౌర్జన్యాలపై కేంద్రానికి పంపారు. అందుకే ఈసిపై కత్తికట్టారు, కుటుంబాన్ని బెదిరించారు. ఎన్నికల్లో వైసిపి దౌర్జన్యాలపై కోర్టులలో కేసులు వేయాలి. అటు ప్రజాక్షేత్రంలో, ఇటు న్యాయక్షేత్రంలో పోరాడాలి. ఎన్నికల చట్టాలు, నిబంధనలపై అభ్యర్ధులు అవగాహన పెంచుకోవాలి. చట్ట నిబంధనలను అధ్యయనం చేయాలి, విశ్లేషించాలని సూచించారు. ఏపిలో ఎన్నికల ప్రధానాధికారికే భద్రతలేదు. ఈసిని ముఖ్యమంత్రి, మంత్రులు బెదిరించారు. ఎన్నికలు వాయిదా వేశారనే వైసిపి అక్కసు. ఈసి పైనే దాడులకు పాల్పడే నైజం వైసిపి నేతలది. ఈసి కుటుంబ సభ్యులకే ఏపిలో రక్షణ లేదు. కేంద్ర బలగాలు ఈసికి రక్షణగా వచ్చాయి. ఈసి లేఖతో వైసిపి అక్కసు రెట్టింపైంది. టిడిపిపై అసత్య ఆరోపణలకు తెగబడ్డారు. వీటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలి. సిఎస్ లేఖలో కరోనా బెడద నాలుగు వారాలు లేదన్నారు. లేఖ రాసిన నాలుగు రోజుల్లోనే విద్యాసంస్థలు మూశారు. ఆలయాలు, సినిమాహాళ్లు బంద్ చేశారు. దీనిపై సీఎస్, సిఎం ప్రజలకు జవాబివ్వాలి. కరోనాపై ముఖ్యమంత్రి ఒకరకంగా మాట్లాడారు. మంత్రులు ఇంకోరకంగా మాట్లాడారు. అధికారులు తలోరకంగా కరోనాపై వ్యాఖ్యానాలు. ఒకరికొకరికి పొంతన లేకుండా పోయింది. రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరేం మాట్లాడతారో, ఎవరేం చేస్తారో తెలీని దుస్థితి. కరోనా అనేది రోగం కాదని సీఎం అన్నారు. టైఫాయిడ్, ఫ్లూ లాగా కరోనా కామన్ అన్నారు. పారాసిటమాల్, బ్లీచింగ్ వ్యాఖ్యలతో నవ్వులపాలు అయింది. ప్రజల ఆరోగ్యంతో వైసిపి చెలగాటం ఆడుతోందని చంద్రబాబు విమర్శించారు.