తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జనతా కర్ప్యూ సంపూర్ణ బంద్
జనతా కర్ఫ్యూ నేపథ్యంలో . హైదరాబాద్ - విజయవాడ హైవే మూసివేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణ బంద్ కనిపిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా రోడ్లు నిర్యానుష్యంగా మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జనతా కర్ఫ్యూ సంపూర్ణంగా కొనసాగుతోంది. ప్రజలు ఇళ్లకు పరిమితమయ్యారు. అన్ని ప్రాంతాల్లో రహదారులు నిర్మానుష్యంగా మారాయి. మెట్రోరైల్వే స్టేషన్లు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ప్రజారవాణా వ్యవస్థ పూర్తిస్థాయిలో నిలిచిపోయింది. రైళ్లు రద్దన్న విషయం తెలియక చాలామంది దూరప్రాంత ప్రయాణీకులు మంచిర్యాల రైల్వే స్టేషన్ వద్ద ఉన్నారు. ఏం చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. అయితే రాత్రి 9 గంటల తర్వాత రైళ్లు ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారులు చెప్పడంతో ప్రయాణీకులు వేచిచూస్తున్నారు. దాదాపు 90 శాతం మంది ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు