YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

రహస్యం:

రహస్యం:

రహస్యం:
విరిగినా అతుక్కునే శివలింగం.. పిడుగుల పరమేశ్వరుడి ఆలయంలో అద్భుతాలెన్నో!
ఆ ఆలయంపై ఏడాదిలో ఒక్కసారైనా పిడుగు పడుతుంది. ఆ పిడుగు నేరుగా గర్భగుడిలో ఉన్న శివలింగంపైనే పడుతుంది. పిడుగు వల్ల శివలింగం విరిగిపోతుంది. కొద్ది రోజుల తర్వాత చూస్తే ఆ శివలింగం మళ్లీ పూర్వరూపంలో ప్రత్యక్షమవుతుంది. ఇది వినేందుకు చాలా ఆశ్చర్యకరంగా ఉంది కదూ. ఈ ఆలయాన్ని సందర్శిస్తే మీరు మరింత అద్భుతంగా ఫీలవుతారు. ఎత్తైన హిమగిరుల్లో.. ప్రకృతి అందాల మధ్య కొలువైన ఈ ఆధ్యాత్మిక కేంద్రంలో ఒక్కసారి అడుగుపెడితే చాలు. మనసు ఎంతో తేలిగ్గా ఉంటుంది. మహిమ గల ఆలయం ఎక్కడుందో తెలుసుకోవాలని ఉందా? అయితే, చూడండి.
కుల్లుకు 22 కిమీల దూరంలో.. మీరు ఎప్పుడైనా హిమాచల్ ప్రదేశ్‌కు వెళ్లారా? ఈ సారి వెళ్తే తప్పకుండా కులు-మనాలిని సందర్శించండి. ముఖ్యంగా కులుకు 22 కిలో మీటర్ల దూరంలో ఉన్న ‘బిజిలీ మహాదేవ్’ ఆలయాన్ని తప్పకుండా సందర్శించండి. అయితే, ఈ ఆలయానికి చేరుకోవాలంటే మూడు కిలో మీటర్లు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. అయితే, ఈ ట్రెక్కింగ్ మీకు అస్సలు బోరు కొట్టదు. చుట్టూ ఉండే ప్రకృతి అందాలను చూస్తూ నడిస్తే అలసటే అనిపించదు. ‘బిజిలీ మహాదేవ్’ ఆలయంలో ఉన్న శివలింగాన్ని దర్శిస్తే తప్పకుండా ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోతారు. 
ఏడాకి ఒకసారి శివలింగంపై పిడుగు
ఈ ఆలయంలో ఏడాదికి ఒకసారైన పిడుగు పడుతుంది. ఆ పిడుగు నేరుగా శివలింగం పైనే పడుతుంది. ఫలితంగా శివలింగం ముక్కలవుతుంది. దీంతో ఆలయ పూజారులు ఆ ముక్కలను ఒకచోటకు చేర్చి తృణధాన్యాలు, పిండి, వెన్నతో లింగంగా మార్చుతున్నారు. కొద్ది రోజుల తర్వాత ఆ శివలింగం మళ్లీ పూర్వ రూపంలోకి మారిపోతుంది. పగుళ్లు కూడా కనిపించకుండా పూర్తిస్థాయి శివలింగంలా దర్శనమిస్తుంది. ప్రజలను రక్షించేందుకే.. ఈ శివలింగం నిత్యం పిడుగుపాటుకు గురికావడం వల్ల ఈ ఆలయానికి ‘బిజిలీ మహాదేవ్’ అని పేరు వచ్చింది. హిందీలో బిజీలీ అంటే విద్యుత్ లేదా పిడుగు. ఆ ఆలయం పరిసరాల్లో జీవించే ప్రజలను, జంతువులను రక్షించేందుకే ఆ పరమశివుడు ఆ పిడుగుపాటుకు గురవుతాడని స్థానికుల నమ్మకం. అయితే, ఈ ఆలయం ఏర్పడిన ప్రాంతం గురించి పురాణాల్లో ఓ ఆసక్తికరమైన కథ ఉంది. రాక్షసుడు పాముగా మారి.. కులు ప్రాంతంలో కులాంతా అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు ఓ విషపూరితమైన పాముగా లాహౌల్-స్పితీలోని మాథాన్ గ్రామానికి చేరుకుంటాడు. ఈ సందర్భంగా అతడు బియాస్ నదికి గండిపెట్టి ఆ గ్రామాన్ని వరదతో ముంచి నాశనం చేయాలని ప్రయత్నిస్తాడు. ఈ సందర్భంగా బియాస్ నదిలో ఈదుతూ ఆ ప్రవాహాన్ని ఆ గ్రామం వైపు మళ్లించేందుకు కుట్రపన్నుతాడు. ఈ విషయం తెలుసుకున్న పరమశివుడు పాము రూపంలో ఉన్న కులంతాను అంతం చేస్తాడు. మరణం తర్వాత కులంత శరీరం పెద్ద పర్వతంగా రూపాంతరం చెందిందని, అందుకే ఆ ప్రాంతానికి కుల్లు అని పేరు వచ్చిందని చెబుతారు.
శివలింగం అతుక్కోవడం వెనుక మిస్టరీ ఏమిటీ?
విరిగిన శివలింగం మళ్లీ పూర్వ స్థితికి మారడానికి గల కారణం తెలుసుకోవడానికి చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేశారు. కానీ, ఫలితం దక్కలేదు. సాధారణంగా పిడుగు పడితే రాయి చెల్లా చెదురవుతుంది. జిగురుతో అతికించినా అది పూర్తిస్థాయిలో అంటుకోదు. అలాంటి పూజర్లు పిండి, తృణధాన్యాలతో అతికిస్తే ఆ శివలింగం ఎలా అతుక్కుంటుందనేది ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీనే. ఈ ఆలయానికి చేరుకోవాలంటే దేవదారు వృక్షాల మధ్య సుమారు 1000 మెట్లను ఎక్కాల్సి ఉంటుంది. పర్వతం మీదకు ఎక్కిన తర్వాత కుల్లు, పార్వతీ వ్యాలీ అందాలు భలే అద్భుతంగా కనిపిస్తాయి. శివరాత్రి రోజున ఈ ప్రాంతం భక్తులతో కిక్కిరిసిపోతుంది. అయితే, డిసెంబరు, జనవరి నెలల్లో మాత్రం ఈ ప్రాంతం మంచుతో కప్పి ఉంటుంది. ఆలయం కూడా మూసి ఉంటుంది. మీరు కూడా ఈ శివలింగం రహస్యం తెలుసుకోవాలంటే తప్పకుండా ఈ ఆలయాన్ని సందర్శించండి.

వరకాల మురళి మోహన్ సౌజన్యంతో 

Related Posts