YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

*పిచ్చుకల కిచ కిచలు*

*పిచ్చుకల కిచ కిచలు*

*పిచ్చుకల కిచ కిచలు*
*కాకుల కావు కావు అరుపులు*
*నాలుగిళ్ల ఆవల పిల్లల ఏడుపు కూడా స్పష్టంగా విన పడుతున్నాయి!*
*జనతా కర్ప్యూ పుణ్యమాని!!*
*విభిన్న ప్రాంతాలు, భాషలు, సంస్కృతులు కలబోసిన అఖండ భారతం ఒకే ఒక వ్యక్తి పిలుపుకి స్పష్టంగా స్పందించింది!*
*ఎవరికి వారు ఎవరి ఒత్తిడి లేకుండా స్వఛ్ఛందంగా కర్ప్యూ విధించుకొని ఇంట్లోనే ఉండిపోవడం ఇలా... దేశ చరిత్ర లోనే ప్రథమం!*
*చివరికి చీమలు కూడా క్షేమంగా రోడ్డు క్రాస్ చేయగలుగుతున్నాయి మరి!!*
*అరుపులు, వాహనాల రణ గొన ధ్వనుల్లేవు!*
*ఎంత ప్రశాంతంగా, హాయిగా ఉందో!*
*కరోనా వైరస్ వ్యాప్తికి ఖచ్చితంగా బ్రేక్ వచ్చి తీరుతుంది!*
*వారానికో సారి లేదా నెలకోసారైనా జనతా కర్ఫ్యూ పెడితే బాగుండు!* *నిజమే!*
*ఎందుకంటారా?!*
 *ఉరుకుల పరుగుల జీవితంలో ఇలాగైనా విశ్రాంతి దొరుకుతుంది!*
 *కాలుష్యం దుమ్మూ ధూళి తగ్గి పోతాయి*
 *వాహనాలు బయట తిగవు కాబట్టి డీజల్ పెట్రోల్ ఆదా!*
 *అవనసరమైన ఖర్చూ తగ్గుతుంది!*
 *ఇంట్లో వండినవే తింటాం కాబట్టి ఆరోగ్యం బాగుంటుంది!*
 *రోజంతా కుటుంబమంతా కలిసి ఉండటం వల్ల బంధాలు  బలోపేత మవుతాయి!*
 *ఇంట్లో ఇల్లాలి కష్టాలు బాధలు అర్థమవుతాయి*
 *క్లీన్ అండ్ గ్రీన్ లో మునిగిపోవడం వల్ల మనిల్లు మనకి ఎంతో అందంగా అనిపిస్తుంది!*
 *కానీ........*
*రోజు కూలి చేసుకొని బతికే వాళ్లకి ఆ రోజు ప్రత్యామ్నాయ మార్గం చూపాలి!* rajan
*అత్యవసర  పనులకి మినహాయింపు ఉంటే చాలు!*
*జనతా కర్ఫ్యూ వల్ల అంతా మంచే జరిగింది!*

వరకాల మురళి మోహన్ సౌజన్యంతో 

Related Posts