YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

 రైలు లో కరోనా అనుమానితుడు

 రైలు లో కరోనా అనుమానితుడు

 రైలు లో కరోనా అనుమానితుడు
భువనగిరి టౌన్ మార్చి 23
సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ రైలు లో ప్రయాణిస్తున్న ఓ ఎన్ఆర్ఐను ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి రైల్వేస్టేషన్లో దింపి గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఉద్యోగం చేసే ఏపీ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన యువకుడు శనివారం రాత్రి హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాడు. అక్కడి నుంచి కాచిగూడ రైల్వేస్టేషన్కు చేరుకుని ఆదివారం ఉదయం సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ లో నాగపూర్ బయలుదేరాడు. క్వారంటైన్ గుర్తును గమనించిన తోటి ప్రయాణికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రైలును అర్ధాంతరంగా భువనగిరి రైల్వేస్టేషన్లో నిలిపివేసి, యువకుడిని అదుపులోకి తీసుకుని సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఎన్ఆర్ఐ ప్రయాణించిన బోగీని క్రిమినిరోధక ద్రావణంతో శుభ్రం చేసి, ప్రయాణికులకు శానిటైజర్లు అందజేశారు

Related Posts