‘కరోనా’ నిబందనలు అతిక్రమిస్తే 6 నెలల కఠిన జైలు శిక్ష
హైదరాబాద్, మార్చి 23,
కరోనా వైరస్ కు సంబంధించిన అతిక్రమణలకు శిక్షలు భారీగానే ఉన్నాయి. తెలిసి తెలియని తనంతో ఈ నేరాలు చేసినా కూడా శిక్షలు తప్పవు. అందుకే అందరూ జాగ్రత్తగా ప్రభుత్వ ఆదేశాలను పాటించాలి.ఐపిసి సెక్షన్ 188: ప్రభుత్వం జారీ చేసే ఆదేశాలను ఉల్లంఘించడం: ఇది బెయిలబుల్ అఫెన్సు.ఐపిసి సెక్షన్ 269: ప్రాణాంతకమైన వ్యాధులను నిర్లక్ష్యంతో ప్రబలే విధంగా చేయడం: ఇది బెయిలబుల్ అఫెన్సు అయితే నేరం రుజువైతే ఆరు నెలల కఠిన కారాగారశిక్ష లేదా జరిమానా లేదా రెండూ.ఐపిసి సెక్షన్ 270: ప్రాణాంతకమైన వ్యాధులను కావాలని ప్రబలే విధంగా చేయడం: ఇది బెయిలబుల్ అఫెన్సు అయితే నేరం రుజువైతే రెండు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష లేదా జరిమానా లేదా రెండూఐపిసి సెక్షన్ 271: క్వారంటైన్ నిబంధనను కావాలని ఉల్లంఘించడం: 6 నెలల కఠిన కారాగార శిక్ష లేదా జరిమానా లేదా రెండూ. ఇది నాన్ కాగ్నిజిబుల్ అఫెన్స్.