YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం దేశీయం విదేశీయం

.ప్రపంచ వ్యాప్తంగా కరోనా మృతులు 14,641

.ప్రపంచ వ్యాప్తంగా కరోనా మృతులు 14,641

.ప్రపంచ వ్యాప్తంగా కరోనా మృతులు 14,641
హైదరాబాద్‌, మార్చి 23
ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 192 దేశాలకు కరోనా మహమ్మారి విస్తరించింది. కరోనా బాధితుల సంఖ్య 3.36 లక్షల మందికి పైగా నమోదు కాగా, 14,641 మంది మృతి చెందారు. ఈ వ్యాధి నుంచి 97,636 మంది రోగులు కోలుకున్నారు. కరోనా వైరస్‌ ప్రభావం ఇటలీలో చాలా తీవ్రంగా ఉంది. ఇటలీలో ఆదివారం ఒక్కరోజే 651 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 59,138 కేసులు నమోదు కాగా, ఆదివారం ఒక్కరోజే 5,560 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ఇటలీలో ఇప్పటి వరకు కరోనా మృతుల సంఖ్య 5,476. కరోనా వైరస్‌తో చైనాలో 3,270, స్పెయిన్‌లో 1,772, ఇరాన్‌లో 1,685, ఫ్రాన్స్‌లో 674, అమెరికాలో 419, యూకేలో 281, నెదర్లాండ్స్‌లో 179, దక్షిణ కొరియాలో 104, స్విట్జర్లాండ్‌లో 98, జర్మనీలో 94, బెల్జియంలో 75 మంది మృతి చెందారు. భారతదేశం వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 396కు చేరుకుంది. ఆదివారం ఒక్కరోజే 64 కొత్త కేసులు నమోదు అయ్యాయి. కరోనా మృతుల సంఖ్య ఏడుకు చేరుకుంది. మహారాష్ట్రలో అత్యధికంగా 74, కేరళలో 64, ఢిల్లీలో 30, రాజస్థాన్‌లో 28, తెలంగాణలో 27, ఉత్తరప్రదేశ్‌లో 27, కర్ణాటకలో 26, గుజరాత్‌లో 18, మధ్యప్రదేశ్‌లో 6, ఆంధ్రప్రదేశ్‌లో 6 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 6 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్‌ కట్టడికి పలు రాష్ర్టాలు లాక్‌డౌన్‌ ప్రకటించాయి. అన్ని రైళ్లతో పాటు అంతర్‌ రాష్ట్ర బస్సులను నిలిపివేశారు. అన్ని రాష్ర్టాల్లో ప్రజలు స్వీయ నియంత్రణ పాటిస్తున్నారు.

Related Posts