YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆరోగ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

జాగ్రత! కూరగాయల మార్కెట్లు కరోనా వైరస్ కి కేంద్రాలుగా మారె ప్రమాదం...

 జాగ్రత!  కూరగాయల మార్కెట్లు కరోనా వైరస్ కి కేంద్రాలుగా మారె ప్రమాదం...

 జాగ్రత!  కూరగాయల మార్కెట్లు కరోనా వైరస్ కి కేంద్రాలుగా మారె ప్రమాదం...  

ఇండియాలో కరోనా వైరస్ ఎక్కువగా సోకుతుండటానికి కూరగాయల మార్కెట్లు కీలక కేంద్రాలవుతున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.పుచ్చులు లేకుండా ఉండాలని కూరగాయల్ని ఎక్కువ సేపు ఏరుకుంటారు. అందువల్ల జనం గుమికూడినట్లు అవుతుంది. సమూహం ఏర్పడుతుంది. వారిలో ఎవరికైనా కరోనా వైరస్ ఉంటే... దురదృష్టం కొద్దీ వారు అప్పుడు తుమ్మినా, దగ్గినా వెంటనే చుట్టు పక్కల వారికి ఆ వైరస్ సోకే ప్రమాదం ఉందంటున్నారు.తాజాగా డాక్టర్లు ఏమంటున్నారంటే... కరోనా లక్షణాలు ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో కూరగాయల మార్కెట్లకు వెళ్లొద్దంటున్నారు. అంతేకాదు... ప్రజలు హ్యాండ్ శానిటైజర్ రాసుకోకుండా కూరగాయల మార్కెట్లకు వెళ్లొద్దని చెబుతున్నారు. ఆ మార్కెట్లలోకి వెళ్లాక... ఎంత త్వరగా బయటకు వచ్చేస్తే అంత మంచిదంటున్నారు. ఏపీ ప్రభుత్వం కూడా ఒక్కో రైతు బజార్‌నూ మూడుగా విభజించి, మూడు వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేసే ఆలోచనలో ఉందిచాలా మంది కూరగాయల్లో చాలా వాటిని ముట్టుకొని వదిలేస్తుంటారు. అందువల్ల ఎవరైనా కరోనా వైరస్ ఉన్నవారు తమకు తెలియకుండానే కూరగాయల మార్కెట్‌కు వచ్చి... కొన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు, ఉల్లిపాయల వంటివి కొనుక్కొని వెళ్తే... వాటన్నింటిపైనా కరోనా వైరస్ ఉండే ప్రమాదం ఉంటుందనీ, ఆ తర్వాత ఎవరెవరు కూరగాయల మార్కెట్‌కి వెళ్తారో... వారందరికీ వైరస్ సోకే ప్రమాదం ఉందని చెబుతున్నారు. 

Related Posts