ఎవరైనా నిబంధనల్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు
హైదరాబాద్, మార్చి 23,
రాష్ట్రానికి వచ్చే అన్ని వాహనాలను నిలిపివేసినట్టు తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ చెప్పారు. డీజీపీ మహేందర్ రెడ్డి తో కలసి అయన సోమవారం మీడియాతో మాట్లాడారు. సీఎస్ మాట్లడుతూ తెలంగాణ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే వాహనాలకు సైతం అనుమతించడంలేదన్నారు. ఎక్కడా ఐదుగురు కన్నా ఎక్కువమంది గుమిగూడేందుకు అనుమతిలేదు. ఇప్పటికే విద్యా సంస్థలన్నీ మూసివేశాం. పరీక్షలన్నీ వాయిదా వేశాం. గ్రామాల్లో వ్యవసాయ పనులకు వెళ్లేందుకు అనుమతిస్తాం. ఉపాధి హామీ పనులకు అనుమతిస్తాం. క్వారంటైన్ల నుంచి ఎవరూ బయటకు రావడానికి వీల్లేదు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు. వైద్య సేవలను మాత్రమే అనుమతిస్తాం. లాక్డౌన్కు అందరూ మద్దతివ్వాలని కోరుతున్నామని విజ్ఞప్తి చేశారు. సాయంత్రం 7 గంటల తర్వాత దుకాణాలు, పేట్రోల్ బంకులు బందు. సాయంత్రం 7 గంటల నుండి ఉదయం 6 గంటలవరకు ఎవ్వరు రోడ్ల పైకి రావద్దు. తెలంగాణ లో 30 కి చేరిన కరోన కేసులను వైద్య ఆరోగ్య శాఖ దృవీకరించిందని అయన అన్నారు. ఇవ్వాళ ఒక్కరోజు మూడు పాజిటివ్ కేసులు నమోదు .. వీరు విదేశాల నుండి వచ్చిన వారే. మధ్యాహ్నం నుండి పోలీస్ శాఖ మరింత కఠినంగా ఉంటుందని అయన అన్నారు. నిత్యావసర ధరలు పెరిగితే కఠిన చర్యలు తీసుకుంటాము. ప్రస్తుతం ప్రజలు స్వస్థలాలకు వెళ్ళడానికి కూడా అనుమతి లేదు. ప్రతి వాహనాన్ని చెక్ చేస్తాం అనుమతి లేకుంటే సీజ్ చేస్తామని అన్నారు. సమస్య త్రివ్రంగా ఉంది కాబట్టే లాక్ డౌన్ ప్రకటించామని అన్నారు.