ఇంగ్లీష్ మీడియం విద్య పై ఉత్తర్వులు జారీ
అమరావతి, మార్చి 23
రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం విద్య పై ఉత్తర్వులు జారీ అయింది. రాష్ట్రంలో అన్ని ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలని ఆదేశాలు విడుదల అయ్యాయి. ఒకటి నుండి 6 వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం అమలు అవుతంఉది. ప్రతి మండలానికి ఒక తెలుగు మీడియం స్కూల్ కొనసాగించాలని నిర్ణయించారు. తెలుగు మీడియం చదవాలనుకునే పిల్లల కోసం తెలుగు మీడియం స్కూళ్లు మండలానికి ఒకటి ఏర్పాటు చేస్తారు. ఉర్థు, ఒరియా, కన్నడ, తమిళ మీడియం పాఠశాలలు యథాతథంగా కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రతి మీడియం స్కూల్ లోను తెలుగును కంపల్సరీ సబ్జెక్ట్ చెయ్యాలని ఆదేశాలు జారీ అయ్యాయి. స్కూళ్లకు వెళ్లే విద్యార్థులకు బస్సు ఛార్జీలు కూడా చెల్లించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.