YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

ప్రజా సహకారంతోనే నియంత్రణ

ప్రజా సహకారంతోనే నియంత్రణ

ప్రజా సహకారంతోనే నియంత్రణ
కాకినాడ, మార్చి 23
కరోనా  పాజిటీవ్ కేసులు నమోదు అయిన జిల్లాలలో ప్రజలను మరింతగా అప్రమత్తం చేయ్యాల్సిన అవసరం ఉంది. ప్రజల సహకారంతోనే కరోనాను నియంత్రించగలం.  కరోనా నియంత్రణ కు ప్రభుత్వం తీసుకునే చర్యలకు ప్రజలందరూ సహకరించాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు.  ఎపీలో నమోదు అయిన ఆరు పాజీటీవ్ కేసులలో వారి ఆరోగ్య పరిస్ధితి నిలకడగా ఉంది.  ప్రస్తుతం ఎపీలో కరోనా వ్యాప్తి రెండోవ దశలో ఉంది.  దీనిని మూడవ దశలోకి వెళ్ళకుండా నిరోధించేందుకు సిఎం  జగన్ మోహన్ రెడ్డి పలు చర్యలు తీసుకుంటున్నారు.  నియోజకవర్గం కు ఒక వంద పడకల ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేస్తున్నామని అయన వెల్లడించారు.  108 సిబ్బంది కి అవసరమైన పరికరాలు.. వస్తువులు అందించడంతో పాటుగా.. వారికి మనోధైర్యాన్ని నింపేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. మన రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తక్కవుగా ఉంది. ప్రజలు ఆందోళన చెందవద్దు.  ప్రతి ఒక్కరు సామాజిక దూరం..పరిశుభ్రత పాటిస్తే కరోనాను నియంత్రించగలం.  లాక్ అవుట్ నేపధ్యంలో ఎవరైనా నిత్యవసర వస్తువుల ధరలు పెంచినా...బ్లాక్ మార్కెటింగ్ చేసినా వారిపై కేసులు నమోదు చేస్తామని మంత్రి హెచ్చరించారు.

Related Posts